రోగులకు సేవ చేయడం వైద్యుల బాధ్యత
ఆసుపత్రికి వచ్చే రోగులకు సేవ చేయడం వైద్యుల బాధ్యత అని ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు. గురువారం ఆయన ములుగు జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరును పరిశీలించారు.
జిల్లా ఆసుపత్రిలో వైద్యులకు సూచనలిస్తున్న ఐటీడీఏ పీవో అంకిత్
ములుగు, న్యూస్‌టుడే: ఆసుపత్రికి వచ్చే రోగులకు సేవ చేయడం వైద్యుల బాధ్యత అని ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు. గురువారం ఆయన ములుగు జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. ఆసుపత్రిలో ఎంత మంది నిపుణులు పని చేస్తున్నారు, వారి పనితీరు, ప్రధాన కార్యాలయ నిర్వహణ తదితర అంశాలపై ఆరా తీశారు. ములుగు-వెలుగు యాప్‌లో గత 15 రోజుల సిబ్బంది హాజరును పరిశీలించారు. ఓపీ, ప్రత్యేక వైద్యుల గదులు, ల్యాబోరేటరీ, ఎక్స్‌రే గది, సీటీ స్కాన్ తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న పరీక్షా పరికరాల పని తీరును చూశారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్, ప్రత్యేక వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆసుపత్రిపై ఐటీడీఏలో కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రత్యేక వైద్యులు సమయపాలన పాటించడం లేదన్నారు. ఏటూరునాగారం సామాజిక ఆరోగ్య కేంద్రంతో పాటు దాని చుట్టుపక్కల గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రికి కేసులు వస్తున్నాయని అన్నారు. జిల్లా ఆసుపత్రిలో చాలా మంది ప్రత్యేక వైద్యులు పని చేస్తున్నారనే నమ్మకంతో రోగులు వస్తున్నారని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు అందుబాటులో ఉండి సేవ చేయాలని కోరారు. డాక్టర్లు పి.జగదీశ్వర్, జాన్సన్, వంశీకృష్ణ, సృజన, పట్టాభి రామారావు, ప్రత్యూష, రాజేంద్రప్రసాద్, శ్రమలత, సుధీర్‌రెడ్డి, సుష్మ, అనిల్‌కుమార్, స్వప్న, లిఖిత, నవీన్, అనిత, దీప, మౌనిక, వినయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Social look: అనసూయ బ్లూమింగ్.. తేజస్వి ఛార్మింగ్..
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
World News
Erdogan: జైలు నుంచి అధ్యక్షపీఠం వరకు.. ఎర్డోగాన్ రాజకీయ ప్రస్థానం..!
-
Politics News
AAP-Congress: ఆర్డినెన్స్‌పై పోరు.. ఆమ్ఆద్మీకి కాంగ్రెస్ మద్దతిచ్చేనా?