logo

వైకాపా అభ్యర్థిపై సా...గుతున్న విచారణ

పాలకొల్లు వైకాపా నియోజకవర్గ అభ్యర్థి గూడాల శ్రీహరిగోపాలరావు, ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల ప్రచారంలో పలు ప్రాంతాల్లో మహిళలకు నగదు, కానుకలు అందజేశారు

Published : 18 Apr 2024 05:31 IST

24 గంటల్లో చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్‌

 పాలకొల్లు, న్యూస్‌టుడే: పాలకొల్లు వైకాపా నియోజకవర్గ అభ్యర్థి గూడాల శ్రీహరిగోపాలరావు, ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల ప్రచారంలో పలు ప్రాంతాల్లో మహిళలకు నగదు, కానుకలు అందజేశారు. ఈ వీడియో సాక్ష్యాలతో కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌మీనాకు ఈ నెల 15న రాత్రి పాలకొల్లు నుంచి ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు వెళ్లింది. వైకాపా అభ్యర్థితోపాటు కుటుంబ సభ్యులు, గన్‌మెన్లు యథేచ్ఛగా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు విచారణ జరిపి గూడాల శ్రీహరిగోపాలరావుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఈసీ ఆదేశించింది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి బి.ఎస్‌.నారాయణరెడ్డి పురపాలిక కమిషనర్‌, ఎంపీడీవోలతో కూడిన బృందాన్ని విచారణకు నియమించారు. రిటర్నింగ్‌ అధికారి గూడాల శ్రీహరిగోపాలరావుకు దీనిపై బుధవారం నోటీసులు జారీ చేసి 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. నియమావళి ఉల్లంఘనను వీడియోలతో సహా ఫిర్యాదు చేస్తే విచారణ పేరిట తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కలెక్టర్‌ను సంప్రదించగా అభ్యర్థి ఇచ్చిన సమాధానం మేరకు 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని