logo

వైకాపా అండదండలు... నేతలే అనకొండలు..!

అధికార వైకాపా అండదండలతో నేతలు అనకొండల్లా కొండలు, గుట్టలను మింగేస్తున్నారు. ‘పచ్చని చెట్లను నరికేస్తే మళ్లీ నాటుకోవచ్చు. అదే కొండలు, గుట్టలను కొల్లగొడితే వాటి ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉంది’ అని న్యాయస్థానాలు అక్షింతలు వేసినా, ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా అధికార నేతల చెవికెక్కడంలేదు.

Published : 18 Apr 2024 04:14 IST

అధికార వైకాపా అండదండలతో నేతలు అనకొండల్లా కొండలు, గుట్టలను మింగేస్తున్నారు. ‘పచ్చని చెట్లను నరికేస్తే మళ్లీ నాటుకోవచ్చు. అదే కొండలు, గుట్టలను కొల్లగొడితే వాటి ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉంది’ అని న్యాయస్థానాలు అక్షింతలు వేసినా, ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా అధికార నేతల చెవికెక్కడంలేదు. సీఎం జగన్‌ పాలనలో మట్టి మాఫియా ఇష్టారాజ్యంగా పేట్రేగి పోతోంది. జిల్లాలో ఎక్కడైనా కొండ, గుట్ట గానీ కనిపిస్తే చాలు మట్టి కోసం రాబందుల్లా వాలిపోతూ కాసుల వేట సాగిస్తూ మట్టి దందా సాగిస్తున్నారు. దోచుకోవడం... దాచుకోవడమే లక్ష్యంగా కొండలను పిండి చేస్తున్నారు... గుట్టలను మాయం చేసేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని