- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
‘రెండేళ్ల తర్వాత.. 8వేల కి.మీ ఆవల’
దొరికిన సర్ఫింగ్ బోర్డు
విద్యార్థుల కోసం ఫండ్‌రైజ్ చేస్తానంటున్న హవాయివాసి
ఇంటర్నెట్ డెస్క్: ఏదైనా ఒక వస్తువు పోయి దాదాపు రెండేళ్ల తర్వాత ఎవరికో దొరికి మళ్లీ మీ చేతికి వస్తే ఎలా ఉంటుంది.. హవాయి ద్వీపానికి చెందిన ఓ వ్యక్తికి సముద్ర అలల మీద సర్ఫింగ్ చేయడమంటే సరదా.. అనుకోకుండా అలల ధాటికి సర్ఫింగ్ చేసే తన బోర్డు కొట్టుకుపోయింది. అయితే రెండేళ్ల తర్వాత దాదాపు 8,700 కి.మీ అవతల సర్ఫింగ్ బోర్డు దొరకడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఎవరు అతను.. ఎక్కడ జరిగింది.. ఏంటా వివరాలు తెలుసుకుందామా..!
డౌగ్ ఫాల్టర్.. హవాయిలో ఉండే ఓ ఛాయాగ్రహకుడు. అతడు సర్ఫింగ్ చేయడంలోనూ నైపుణ్యం ఉంది. 2018లో వైమియా తీరంలో సర్ఫింగ్ చేస్తుండగా భారీ అలల దెబ్బకు సర్ఫింగ్ బోర్డు కొట్టుకుపోయినట్లు తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా చెప్పాడు. సర్ఫింగ్ బోర్డు ఎలా కొట్టుకుపోయిందీ.. ఏ విధంగా తనకు చేరిందో ఇలా రాసుకొచ్చాడు.. ‘‘వైమియా తీరంలో సర్ఫింగ్ చేస్తుండగా అలల ధాటికి కొట్టుకుపోయిన బోర్డు మత్స్యకారులకైనా దొరుకుతుందేమోనని ఆశ పడ్డాను. అయితే మత్స్యకారులు కూడా తాము చూడలేదని చెప్పడంతో మళ్లీ నిరాశ ఆవహించింది. ఎన్నో పెద్ద పెద్ద అలలను లెక్క చేయకుండా ఆ బోర్డుమీద సర్ఫింగ్ చేశా. ఇలా అలల దెబ్బకు కొట్టుకుపోయిన బోర్డులన్నీ తీరంలో తేలుతుంటాయని మత్స్యకారులు చెబుతుంటారు. ఆ ఆశలు కూడా కల్లలే అయ్యాయి. అక్కడకూ చేరలేదు. అయితే గత కొద్ది రోజుల కిందట ఫేస్‌బుక్ ద్వారా ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఫిలిప్పైన్స్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద నా సర్ఫింగ్ బోర్డు ఉందని. నిజం చెప్పాలంటే హవాయి నుంచి దాదాపు 8,700 కి.మీ దూరం ఫిలిప్పైన్స్. అయితే ఫిలిప్పైన్స్‌కు చెందిన ఆ వ్యక్తి తన విద్యార్థులకు సర్ఫింగ్ ఎలా చేయాలని నేర్పించడానికి ఓ మత్స్యకారుడి నుంచి కొనుగోలు చేశాడంట. ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది. నా బోర్డుతో విద్యార్థులు సర్ఫింగ్ నేర్చుకోవడం కంటే మంచి ముగింపు ఏముంటుంది. ప్రస్తుతం విదేశీ ప్రయాణానికి సంబంధించి నిబంధనలు ఉండటం వల్ల అక్కడకు వెళ్లలేకపోతున్నా. అయితే సర్ఫింగ్ నేర్చుకునే వారికి అండగా ఉండేందుకు ఫండ్ రైజింగ్ చేస్తానని, మరిన్ని బోర్డులతో విమానంలో అక్కడకు వెళ్తా. ఆయనకు ఉన్న 144 మంది విద్యార్థుల్లో కొంతమందికైనా సర్ఫింగ్ చేయడం నేర్పుతా’’ అని ఫాల్టర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అలాగే మంచి కార్యం కోసం విరాళాలు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vijay Deverakonda: ఆ విషయంలో నాకు ఏడుపొస్తుంది: విజయ్ దేవరకొండ
-
General News
Andhra News: స్వాతంత్ర్య దినోత్సవ వేళ.. 175 మంది ఖైదీల విడుదల
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
Khammam: కార్యకర్తలు సంయమనం పాటించాలి.. కృష్ణయ్య హత్య ఘటనపై తుమ్మల దిగ్ర్భాంతి
-
Sports News
MS Dhoni : ధోనీ వీడ్కోలు పలికి అప్పుడే రెండేళ్లు.. మరోసారి వైరల్‌గా మారిన రిటైర్మెంట్ ‘టైమ్’
-
Viral-videos News
Viral Video: ఇద్దరు వైద్యుల డ్యాన్స్.. ఇప్పుడు నెట్టింట హల్చల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Puri Jagannadh: విజయ్ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Flag Hoisting: కరుణానిధి చొరవతో సీఎంల జెండావందనం!
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ