పిరమిడ్‌ తిరగేస్తే..

పిరమిడ్లు.. కొన్ని వేల సంవత్సరాల క్రితమే నిర్మించిన మహోన్నతమైన కట్టడాలు.. వీటి నిర్మాణానికి ఉపయోగించిన భారీ రాళ్లను ఎలా తరలించారని ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్న విషయం తెలిసిందే.

Published : 15 Jan 2020 12:38 IST

ఈజిప్ట్‌ పిరమిడ్లు.. కొన్ని వేల సంవత్సరాల క్రితమే నిర్మించిన మహోన్నతమైన కట్టడాలు.. వీటి నిర్మాణానికి ఉపయోగించిన భారీ రాళ్లను ఎలా తరలించారని ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్న విషయం తెలిసిందే. అయితే మనం ఇప్పుడు  తెలుసుకునే అంశం పిరమిడ్‌ను తిరగేస్తే ఎలా ఉంటుందని..  మీరు చదువుతున్నది నిజమే.. స్లోవేకియా రాజధాని బ్రటిస్లావాలో అచ్చంగా పిరమిడ్‌ను తిరగేస్తే ఎలా ఉంటుందో అన్న రీతిలో ఉన్న నిర్మాణం పర్యాటకులను ఆకట్టుకుంటోంది..

కమ్యూనిస్టు పాలనలో ప్రారంభం..
అప్పట్లో చెక్‌, స్లోవేకియా దేశాలు చెకోస్లోవేకియా అన్న పేరుతో ఒక్కటిగానే ఉండేవి. రాజధాని బ్రటిస్లావాలో 1967లో రేడియో కేంద్ర నిర్మాణాన్ని వినూత్నంగా చేపట్టాలని అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా పిరమిడ్‌లను తిరగేస్తే ఎలా ఉంటాయో ఉన్న నమూనాలను ఆమోదించారు. వాస్తవానికి ఇది ఒక్క కట్టడం కాదు.. రెండు కట్టడాలు కావడం విశేషం. రేడియో రికార్డింగ్‌ కోసం ఈ డిజైన్‌ను ఎంచుకున్నట్టు చెబుతారు.

మరమ్మతులు వస్తే కష్టమే..
వాస్తుపరంగా ఇదో అద్భుత కట్టడం. అయితే ఇందులో ఉపయోగించిన పలు వస్తువులు నేడు దొరకడం లేదు. ఉదా. ఇందులో వినియోగించిన టైల్స్ దెబ్బతింటే అదే రీతిలో  అమర్చడం కుదరదు. ఎందుకంటే ఆ టైల్స్‌ తయారుచేసే కంపెనీలు ఎప్పుడో మూతపడ్డాయి. 

ఇప్పటికీ రేడియో సేవలు..
ఈ కేంద్రం నుంచి ఇప్పటికీ స్లోవేకియా రేడియో తన ప్రసారాలను నిర్వహిస్తోంది. ఇందులో రికార్డింగ్‌ స్టూడియోలతో పాటు పలు పెద్ద పెద్ద సమావేశపు మందిరాలు ఉన్నాయి. ఈ భవనాన్ని వీక్షించేందుకు ఏటా వేలాదిమంది వస్తుంటారు. ఇదే రీతిలో అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోను కొన్ని నిర్మాణాలు నిర్మించారు. కానీ స్లోవేకియాకు ఉన్నంత ప్రాముఖ్యం లభించలేదు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని