పేద దేశాల్లో ఆ టీకా పంపిణీకి WHO పచ్చజెండా..
కోవాక్స్ కార్యక్రమం ద్వారా ఆస్ట్రాజెనెకా టీకాలను పంపిణీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి
జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా పేద, వెనుకబడిన దేశాల్లోని కోట్లాది ప్రజలకు కొవిడ్ టీకాను అందజేసేందుకు ప్రపంచ దేశాలు, సేవాసంస్థలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థతో చేయికలిపిన సంగతి తెలిసిందే. ‘కోవాక్స్’ పథకం కింద 92 పేద, మధ్య తరగతి దేశాల్లో కరోనా టీకా పంపిణీ జరగనుంది. కాగా, కోవాక్స్ కార్యక్రమం ద్వారా ఆస్ట్రాజెనెకా టీకాలను పంపిణీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించింది.
కొవిడ్-19 మహమ్మారిని అదుపులోకి తేగలమనే నమ్మకం ఇప్పుడు మరింత పెరిగిందని డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఈ సందర్భంగా వెల్లడించారు. మిగతా వ్యాక్సిన్ రకాలతో పోలిస్తే, ఆస్ట్రాజెనెకా టీకాను నిల్వ చేయటం, తరలించటం సులభం. దీనితో కొవాక్స్ పథకం కింద అందజేయనున్న అన్ని డోసులు ఆస్ట్రాజెనెకా తయారు చేసినవే కావచ్చని తెలుస్తోంది.
కాగా ఇప్పటికే 2.4 మిలియన్ ప్రజలను పొట్టన పెట్టుకున్న కరోనా నుంచి విముక్తి పొందేందుకు పలు ప్రభుత్వాలు టీకాపైనే తమ నమ్మకాన్ని పెట్టుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 172 మిలియన్ డోసుల టీకా పంపిణీ జరిగినప్పటికీ.. వాటిలో అధిక శాతం ధనిక దేశాల్లోనే జరగటం గమనార్హం. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా చర్య.. పేద దేశాలకు కూడా త్వరలోనే కరోనా టీకా లభించగలదనే ఆశాభావాన్ని కలిగిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Heart Attacks: తీవ్ర గుండెపోటు కేసులు ‘ఆ రోజే’ ఎక్కువ..? తాజా అధ్యయనం ఏమందంటే..!
-
India News
Odisha Train Accident: మృతులు, బాధితులను గుర్తించేందుకు సహకరించండి.. రైల్వేశాఖ విజ్ఞప్తి
-
Sports News
Virat Kohli: కష్టకాలంలో విరాట్‌కు అదృష్టం కలిసి రాలేదు.. : గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Crime News
Toll Gate: గేటు తీయడం ఆలస్యమైందని.. టోల్ ఉద్యోగి హత్య
-
Movies News
Siddharth: ఒంటరిగా పోరాడలేకపోతున్నా, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా: సిద్దార్థ్
-
Viral-videos News
viral videos: చిన్నారులుగా దేశాధినేతలు.. ఏఐ మాయ చూస్తారా..?