RT-PCR టెస్ట్‌లకు ఒకే ధర ఉండాలి!

రోనా నిర్ధారణకు చేసే ఆర్టీ-పీసీఆర్‌ టెస్టులకు దేశమంతా ఒకే ధర ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఒక్కో పరీక్షకు దేశమంతా గరిష్ఠంగా రూ.400 ఉండేలా ఆదేశాలివ్వాలని.....

Published : 14 Nov 2020 01:43 IST

సుప్రీంకోర్టులో పిల్ దాఖలు

దిల్లీ: కరోనా నిర్ధారణకు చేసే ఆర్టీ-పీసీఆర్‌ టెస్టులకు దేశమంతా ఒకే ధర ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఒక్కో పరీక్షకు దేశమంతా గరిష్ఠంగా రూ.400 ఉండేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ కోరారు. దేశంలోని ఒక్కోచోట ఒక్కోలా ధరలు ఉన్నాయని, పలు రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో ఈ పరీక్ష కోసం రూ.900 నుంచి 2800 వరకు వసూలు చేస్తున్నారని పిటిషనర్‌ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

కరోనాతో నెలకొన్న విపత్తును అవకాశంగా వాడుకొని ప్రైవేటు ల్యాబోరేటరీలు, ఆస్పత్రుల యాజమాన్యాలు కోట్లకు కోట్లు సంపాదిస్తున్నాయని ఆరోపిస్తూ అజయ్‌ అగర్వాల్‌ అనే న్యాయవాది పిల్‌  దాఖలు చేశారు. లాభాల మార్జిన్‌ ఏపీలో 1400 శాతం ఉండగా.. దిల్లీలో 1200 శాతంగా ఉన్నట్టు పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. భారత మార్కెట్లలో ప్రస్తుతం ఆర్టీ-పీసీఆర్‌ కిట్లు రూ.200 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఈ అంశం దేశంలోని 135 కోట్ల మందికి సంబంధించినదని, కరోనా వైరస్‌తో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నట్టు పిల్‌లో పేర్కొన్నారు. అధిక ధరలు చెల్లించి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని