ఆత్మహత్యలపై మీ వైఖరి తేల్చండి
ఆత్మహత్యలపై తమ వైఖరిని స్పష్టం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి సూచించింది.
కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీం
దిల్లీ: ఆత్మహత్యలపై కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం, భారతీయ శిక్షా స్మృతితో విభేదించటంతో.. ఈ అంశంపై తమ వైఖరిని స్పష్టం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి సూచించింది. భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 309 ఆత్మహత్యను శిక్షార్హమైన నేరంగా స్పష్టం చేయగా.. 2017 నాటి మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం లోని సెక్షన్ 115, ఆత్మహత్య తీవ్రమైన మానసిక ఒత్తిడి వలన సంభవించే పరిణామంగా పేర్కొనడం పరస్పర విరుద్ధంగా ఉందని సుప్రీం వెల్లడించింది.
జంతువుల ముందుకు దూకి..
జంతుప్రదర్శన శాలల్లో క్రూర జంతువుల ముందు దూకి ఆత్మహత్య చేసుకునే వ్యక్తుల ప్రయత్నాలను ఆపాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు ఏనుగు ఉన్న చోటికి దూకటంతో.. అతడిని రక్షించే ప్రయత్నంలో ఏనుగును చిత్రహంసకు గురిచేయటంపై జంతుహక్కుల కార్యకర్త సంగీతా డోగ్రా పిటిషన్ వేశారు. ఈ విధమైన ఆత్మహత్యా ప్రయత్నాలను ఆపేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం, సెంట్రల్ జూ అథారిటీలను ఆదేశించాలంటూ ఆమె తన విజ్ఞాపనలో కోరారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి. రామసుబ్రహ్మణియన్లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
మానసిక ఒత్తిడి మాత్రమే కారణం కాదు
ఆత్మహత్యకు కారణం మానసిక ఒత్తిడే కారణం కానవసరం లేదని, నిరసన కూడా కావచ్చని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే అభిప్రాయపడ్డారు. ఇందుకు వియత్నాంకు చెందిన సన్యాసులను ఉదహరించారు. పూర్తి మానసిక ప్రశాంతతతో ఉండే వీరు.. సంధారా అనే విధానం ద్వారా ప్రపంచ బంధనాల నుంచి విముక్తి పొందటాన్ని ఆయన ప్రస్తావించారు. దీనిని ఆత్మహత్యగా పరిగణించలేమని ఆయన తెలిపారు.
ఈ కేసు విచారణలో మాజీ ఆదనపు సొలిసిటర్ జనరల్ ఏఎన్ఎస్ నాదకర్ణిని అమికస్ క్యూరీగా నియమించారు. ఈ మేరకు కేంద్రం వైఖరిని స్పష్టం చేయాలంటూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తోటి పిటిషనర్‌గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్‌గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్‌కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. -
మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్ టచ్‌పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు
నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్ టచ్’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. -
జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు
అయోధ్య రామమందిరంపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్‌లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.