కొవిడ్‌ ముప్పును తగ్గించే ప్రాచీన జన్యువు

సుమారు రెండు లక్షల సంవత్సరాల కిందటి నియాండర్తల్‌ మానవుల నుంచి పారంపర్యంగా వస్తున్న

Updated : 18 Feb 2021 12:10 IST

ఆదిమానవుల నుంచి వారసత్వ సంక్రమణ

లండన్‌: సుమారు రెండు లక్షల సంవత్సరాల కిందటి నియాండర్తల్‌ మానవుల నుంచి పారంపర్యంగా వస్తున్న ఓ రకం జన్యువు... కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడంలో తోడ్పడుతున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది! ఆఫ్రికాయేతరుల్లోని సుమారు సగం మందిలో ఈ జన్యువు ఉంటున్నట్టు తేలింది. ఇలాంటి వారికి... కరోనా కారణంగా ఐసీయూల్లో చేరాల్సిన అవసరం 20% తక్కువగానే ఉంటున్నట్టు రూఢి అయింది. స్వీడన్‌లోని కరొలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ నిపుణులు ఈ విషయాన్ని కనుగొన్నారు.

‘‘ఓఏఎస్‌ అనే జన్యువులు వైరస్‌ జన్యుక్రమాన్ని విచ్ఛిన్నంచేసే ప్రొటీన్‌ను నియంత్రిస్తుంది. నియాండర్తల్స్‌కు చెందిన ఓఏఎస్‌ రకం జన్యువు చాలాదేశాల ప్రజల్లో వంశ పారంపర్యంగా వస్తోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇది వారికి ఇతోధికంగా దోహదపడుతోంది. మరోరకం నియాండర్తల్‌ జన్యువు కూడా రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతోంది. కానీ, కొవిడ్‌ను ఎదుర్కొనే విషయంలో ఒక్కోసారి ఇది ప్రతికూలంగా పనిచేస్తోంది’’ అని పరిశోధనకర్త స్వాంటే పాబో చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని