Ayodhya: అయోధ్యలో తితిదే ‘క్యూలైన్‌’ నిర్వహణ పాఠాలు!

అయోధ్యలో భక్తుల రద్దీ క్రమబద్ధీకరణతోపాటు క్యూలైన్ల నిర్వహణపై ఆలయ ట్రస్టు సభ్యులకు తితిదే అధికారులు అవగాహన కల్పించారు.

Updated : 17 Feb 2024 23:50 IST

లఖ్‌నవూ: అయోధ్య రామమందిరానికి (Ayodhya Ram Mandir) భక్తులు పోటెత్తుతున్నారు. బాల రాముని దర్శనానికి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే భక్తుల రద్దీ క్రమబద్ధీకరణతోపాటు క్యూలైన్ల నిర్వహణ (Queue management) తదితర అంశాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు శనివారం ఆలయ ట్రస్టు సభ్యులకు అవగాహన కల్పించారు.

ట్రస్టు ఆహ్వానం మేరకు ఈవో ఏవీ ధర్మారెడ్డి నేతృత్వంలో అధికారులు శనివారం అయోధ్యకు చేరుకున్నారు. ట్రస్టు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేపట్టాలనే విషయాలను వారు ఈవోను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్ల నిర్వహణకు సంబంధించి ఇంజినీరింగ్ అధికారులు పలు సూచనలు చేశారు. అనంతరం తితిదే అధికారులకు బాల రాముడి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని