క్యాన్సర్‌ నయమవుతుందంటూ.. చిన్నారిని గంగలో ముంచడంతో..

క్యాన్సర్‌తో పోరాడుతున్న ఐదేళ్ల బాలుడిని ఆ కుటుంబం మూఢనమ్మకానికి బలి చేసింది. గంగలో ముంచి ఎంతకీ బయటకు తీయకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.

Updated : 25 Jan 2024 13:06 IST

దేహ్రాదూన్‌: కాలం మారుతున్నా కొందరు మాత్రం ఇంకా మూర్ఖంగానే ప్రవర్తిస్తున్నారు. బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఐదేళ్ల బాలుడిని మూఢనమ్మకానికి బలి చేసింది ఓ కుటుంబం. ఈ ఘటన ఉత్తరాఖండ్‌ (uttarakhand)లో బుధవారం చోటుచేసుకొంది.

పోలీసుల వివరాల మేరకు.. దిల్లీకి చెందిన ఓ ఐదేళ్ల బాలుడు బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు తమ కుమారుడిని కాపాడమంటూ ఎంతోమంది వైద్యులను సంప్రదించారు. కానీ, అతడి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో బాలుడిని కాపాడలేమంటూ డాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో తమ బిడ్డను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. బాలుడిని గంగలో ముంచితే రోగం నయం అవుతుందని అనుకున్నారు.

మధుమేహుల్లో పెరుగుతున్న కొవిడ్‌యేతర మరణాలు!

దీనిలో భాగంగా బాలుడిని తీసుకొని తల్లిదండ్రులతో పాటు అతడి అత్త హరిద్వార్‌కు బయలుదేరారు. ఒకవైపు తల్లిదండ్రులు పార్థనలు చేస్తుండగా.. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని అతడి అత్త చల్లగా ఉన్న నది నీటిలో ముంచింది. ఇదంతా అక్కడున్నవారు గమనించారు. ఎంతకీ బాలుడిని బయటకు తీయకపోవడంతో ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె వారిపై దాడికి యత్నించింది. బాలుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని