Salman Khurshid: ‘ఖర్గే అధ్యక్షుడైనా.. గాంధీ కుటుంబమే లీడర్’: సల్మాన్ ఖుర్షీద్
కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. దాంతో భాజపా తన విమర్శలకు పదును పెట్టింది.
దిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేవలం పార్టీని నడుపుతారని, గాంధీ కుటుంబం చేతిలోనే నాయకత్వం ఉంటుందని ఆ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయన మాటలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యాఖ్యలు భాజపాకు అస్త్రంగా మారాయి.
‘నిజం బయటకువచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ నేత చెప్పినట్లుగా.. ఎవరు పార్టీ అధ్యక్షులు అయినా దాని పగ్గాలు మాత్రం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేతిలోనే ఉంటాయి. మల్లికార్జున ఖర్గేను రిమోట్ కంట్రోల్ అధ్యక్షుడు లేక రబ్బర్ స్టాంప్ అధ్యక్షులు అని పిలుద్దామా..? ఆయన గాంధీలు చెప్పిందే చేస్తారు. కాంగ్రెస్ అంతర్గత ఎన్నికలు ఒక బూటకం’ అని భాజపా అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శలు చేశారు.
తాజాగా ఖుర్షీద్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గాంధీ కుటుంబానిదే అని అన్నారు. ‘మా లీడర్ గాంధీ కుటుంబమే. ఎప్పటికీ వారే. ఖర్గే పార్టీని నడుపుతారు. పార్టీ కార్యకలాపాలపైనే ఆయన దృష్టి సారిస్తారు’ అని వెల్లడించారు.
ఇటీవల ఈ నేత.. రాహుల్ గాంధీని రాముడితో పోల్చారు. అతనో యోగి, తపస్వి, మహాపురుషుడని వ్యాఖ్యానించారు. ‘రాహుల్ రాముడి వంటివారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా భరతుడి లాంటివారు. కొన్నిసార్లు రాముడు వెళ్లలేని చోటుకు భరతుడు అతని పాదుకలను తీసుకెళ్లాడు. అలాగే, జోడోయాత్ర సందర్భంగా రాహుల్ ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటిస్తున్నా, అన్నిచోట్లకూ స్వయంగా వెళ్లలేరు. కాంగ్రెస్ కార్యకర్తలే భరతుడి మాదిరిగా ఆయన సందేశాన్ని రాష్ట్రమంతా తీసుకెళ్లాలి’ అని పిలుపునిచ్చారు. దీనిపై భాజపా విమర్శలు గుప్పించింది. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. కానీ ఖుర్షీద్ వెనక్కి తగ్గలేదు. తన మాటలను సమర్థించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖలిస్థానీ నేత అమృత్‌పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశాడు. అతడికి నిబంధనల ప్రకారం సహకరించినట్లు పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది. -
పాక్‌లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
ఫేస్బుక్లో పరిచయమైన మహిళ కోసం ఓ వ్యక్తి సైనిక రహస్యాలను పాక్‌కు చేరవేశాడు. వీటిల్లో కీలకమైన డ్రోన్ల వివరాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
‘పాక్‌ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
Mani Shankar Aiyar: పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే భారత్ దాయాదిని గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో హస్తం పార్టీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. -
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్ (Narendra Dabholkar) హత్య కేసులో 11 ఏళ్ల తర్వాత దోషులకు శిక్ష పడింది. -
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)పై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించిన విషయాలు చర్చకు దారితీశాయి. -
ఈడీ ఛార్జ్‌షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
దేశంలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లోని నిందితుల జాబితాలో చేర్చనుంది. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
India-Maldives: కొద్దినెలల క్రితం భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాదని ఆ దేశ విదేశాంగమంత్రి హామీ ఇచ్చారు. -
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న నౌకలోని భారతీయ సిబ్బందిలో ఐదుగురికి విముక్తి లభించింది. దౌత్య చర్చలు ఫలించడంతో వారిని స్వదేశానికి పంపించారు. -
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్‌లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్‌లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్‌కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్‌భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. -
అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు
సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్‌లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. -
పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. -
అదానీ, అంబానీలపై దర్యాప్తునకు ఆదేశించండి
పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ (సీపీఐ) కోరారు. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీం కోర్టును కోరింది. -
కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్ గురువారం పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్, యాపిల్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్‌పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..