Law Commission: ఎన్నారై వివాహాలు.. న్యాయకమిషన్‌ కీలక సిఫార్సులు!

ఎన్నారైలు, ఓసీఐలు- భారత పౌరుల మధ్య జరిగే వివాహాలను భారత్‌లో తప్పనిసరిగా నమోదు చేయడంతోపాటు ఓ సమగ్ర చట్టాన్ని రూపొందించాలని కేంద్రానికి న్యాయ కమిషన్‌ సిఫార్సు చేసింది.

Published : 16 Feb 2024 18:59 IST

దిల్లీ: ప్రవాస భారతీయులు (NRIs), ఓవర్సీస్ సిటిజన్స్‌ ఆఫ్ ఇండియా (OCIs)తో ముడిపడిన మోసపూరిత వివాహాలు పెరుగుతుండటంపై న్యాయ కమిషన్‌ (Law Commission) ఆందోళన వ్యక్తంచేసింది. ఈ పెళ్లిళ్లకు సంబంధించి ఓ సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. ఎన్నారైలు, ఓసీఐలు- భారత పౌరుల మధ్య జరిగే వివాహాలను భారత్‌లో తప్పనిసరిగా నమోదుచేయాలని సూచించింది. ఈ అంశాలపై రూపొందించిన ఓ నివేదికను న్యాయశాఖకు సమర్పించింది.

ఎన్నారై, ఓసీఐలకు సంబంధించిన మోసపూరిత వివాహాలు.. భారత్‌కు చెందిన జీవిత భాగస్వాములను, ముఖ్యంగా మహిళలను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెడుతున్నాయని కొన్ని నివేదికలు ప్రస్తావిస్తున్నట్లు కమిషన్‌ ఛైర్‌పర్సన్‌, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రుతురాజ్ అవస్థీ పేర్కొన్నారు. విడాకులు, మనోవర్తి, పిల్లల సంరక్షణ, ఎన్నారైలు, ఓసీఐలకు సమన్లు, వారెంట్లు, ఇతర న్యాయపరమైన పత్రాల జారీకి సంబంధించిన నిబంధనలను సమగ్ర చట్టంలో చేర్చాలని తెలిపారు.

హెచ్‌-4 వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.. ‘వర్క్‌ ఆథరైజేషన్‌’ బిల్లు ఆమోదానికి గ్రీన్‌ సిగ్నల్‌!

పాస్‌పోర్టుపై వివాహ స్టేటస్‌, జీవిత భాగస్వామి పాస్‌పోర్ట్‌ను అనుసంధానించడం, భార్యాభర్తలిద్దరి పాస్‌పోర్ట్‌లపై వివాహ రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందుపర్చడం వంటివి తప్పనిసరి చేయడానికి ‘పాస్‌పోర్ట్ చట్టం, 1967లో అవసరమైన సవరణలు తీసుకురావాలని న్యాయ కమిషన్‌ సిఫార్సు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని