Delhi Murder: శ్రద్ధా హత్య కేసు.. నిందితుడికి లై డిటెక్టర్ పరీక్ష
మహారాష్ట్రకు చెందిన అఫ్తాబ్, శ్రద్ధాలు మూడేళ్లు సహజీవనం చేశారు. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా పదేపదే ఒత్తిడి చేస్తుండటంతో అఫ్తాబ్ ఆమెను మే 18న గొంతుకోసి చంపాడు. ఇప్పుడు ఈ కేసు విచారణ జరుగుతోంది.
దిల్లీ: సహజీవన భాగస్వామిని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడికి లై డిటెక్టర్ పరీక్ష(నార్కో అనాలసిస్) చేసేందుకు కోర్టు అనుమతించింది. అలాగే మరో ఐదు రోజుల పోలీసు కస్టడీని పొడిగించింది. ఈ కేసు విచారణలో భాగంగా స్థానిక కోర్టు వద్ద నిరసనలు వ్యక్తం అయ్యాయి. అతడిని ఉరి తీయాలని న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో అతడిని వర్చువల్‌గా కోర్టులో ప్రవేశపెట్టారు.
గత వారం చివర్లో పోలీసులు నిందితుడు అఫ్తాబ్‌ను అరెస్టు చేశారు. ఆ కస్టడీ ఈ రోజుతో ముగిసింది. కానీ మృతురాలు శ్రద్ధా వాకర్ ఫోన్, హత్యకు వాడిన ఆయుధం వంటి కీలక సాక్ష్యాలు ఇంకా లభ్యం కాలేదు. అఫ్తాబ్ హత్యను పక్కా ప్రణాళికతో చేయడంతో ఆధారాలు కనుగొనడం పోలీసులకు సవాలుగా మారింది. విచారణలో అతడు వెల్లడించిన విషయాలను కోర్టు ముందు నిరూపించేందుకు అవి అత్యంత కీలకం. దాంతో విచారణ నిమిత్తం మరో ఐదు రోజుల కస్టడీకి కోర్టు అంగీకరించింది. అయితే హత్య జరిగి ఆరు నెలలు కావడంతో ఇప్పుడు వీటి సేకరణ క్లిష్టంగా మారింది. మరోపక్క కేసు నిమిత్తం మరిన్ని సాక్ష్యాల కోసం అతడిని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కూడా తీసుకెళ్లనున్నారు.
మహారాష్ట్రకు చెందిన అఫ్తాబ్, శ్రద్ధాలు మూడేళ్లు సహజీవనం చేశారు. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా పదేపదే ఒత్తిడి చేస్తుండటంతో అఫ్తాబ్ ఆమెను మే 18న గొంతుకోసి చంపాడు. ఆపై శవాన్ని 35 ముక్కలు చేసి వాటిని ఫ్రిజ్‌లో దాచాడు. 18 రోజులపాటు వాటిని రాత్రివేళల్లో నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి విసిరేశాడు. శ్రద్ధా శరీర భాగాలు ఫ్రిజ్‌లో ఉండగానే.. అఫ్తాబ్ ఆన్లైన్ డేటింగ్ యాప్‌లో మరో యువతికి వలవేసి, ఆమెను పలుమార్లు తన అపార్ట్‌మెంట్‌కు రప్పించుకున్నాడని వెల్లడైంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
TS news: ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి.. దిల్లీ ముఠా మోసాలు
-
World News
China: జననాల క్షీణత ఎఫెక్ట్.. అక్కడ పెళ్లికాకపోయినా పిల్లల్ని కనొచ్చు..!
-
General News
TSPSC: గ్రూప్-4 పోస్టులు 9,168.. దరఖాస్తులు 8.47లక్షలు.. గడువు పొడిగింపు
-
Sports News
Ashwin: అతడు సెలెక్షన్ గురించి పట్టించుకోడు.. పరుగులు చేయడమే తెలుసు: అశ్విన్
-
Movies News
Pathaan: షారుఖ్‌ని ‘పఠాన్’ అని 23 ఏళ్ల ముందే పిలిచిన కమల్ హాసన్
-
General News
CM Jagan: సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్