Delhi: మరో 400 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రారంభం

Electric Buses: దిల్లీ ప్రజలకు మరో 400 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. దిల్లీ ఎల్జీ వీకే సక్సేనా.. సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ కలిసి ఈ బస్సులను ప్రారంభించారు.

Published : 05 Sep 2023 16:45 IST

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా, సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ కలిసి మంగళవారం 400 విద్యుత్‌ బస్సులను ప్రారంభించారు. ఐపీ డిపోలో ఈ బస్సులను ప్రారంభించడంతో దిల్లీ నగర వాసులకు అందుబాటులోకి వచ్చిన మొత్తం విద్యుత్‌ బస్సుల సంఖ్య 800కి చేరింది. ఈ సందర్భంగా దిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాశ్‌ గహ్లోత్‌ దిల్లీ ప్రజలకు అభినందనలు తెలిపారు. 

‘ఇండియా’తో భాజపాలో కలవరం.. అందుకే ఇదంతా..: విపక్షాల ధ్వజం

అనంతరం దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో ట్వీట్‌ చేశారు. ‘‘గౌరవ లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో కలిసి 400 కొత్త విద్యుత్‌ బస్సులను జెండా ఊపి ప్రారంభించాం. సబ్సిడీ పథకంలో భాగంగా 921 బస్సులకు గాను ప్రస్తుతం 800 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం రూ.417 కోట్లు సబ్సిడీ ఇవ్వగా.. దిల్లీ ప్రభుత్వం రూ.3674 కోట్లు వెచ్చిస్తోంది. దిల్లీ రహదారులపై ఇప్పుడు మొత్తంగా 800 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. దేశం మొత్తంలో ఇదే అత్యధికం.  2025 చివరి నాటికి దిల్లీ రహదారులపై మొత్తంగా 8వేల ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టడమే మా లక్ష్యం. ఆ సమయానికి నగరంలో 10వేలకు పైగా బస్సులు ఉంటాయి. వీటిలో 80శాతం ఎలక్ట్రిక్ బస్సులే. అతి త్వరలోనే అద్భుతమైన ఎలక్ట్రిక్‌ బస్సులకు దిల్లీ ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందుతుంది’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని