IndiGo: ఇండిగోకు రూ.30లక్షల జరిమానా..

IndiGo: ప్రముఖ ఎయిర్‌లైన్‌ ఇండిగో సంస్థలో కొన్ని వ్యవస్థీకృత లోపాలు ఉన్నట్లు డీజీసీఏ గుర్తించింది. దీంతో ఆ సంస్థకు జరిమానా విధించింది.

Published : 28 Jul 2023 16:13 IST

దిల్లీ: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)కు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) జరిమానా విధించింది. కార్యకలాపాలు, శిక్షణ, ఇంజినీరింగ్‌ విధానాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌లో కొన్ని వ్యవస్థీకృత లోపాలను గుర్తించిన డీజీసీఏ.. రూ.30లక్షల జరిమానా (Fine) చెల్లించాలని ఇండిగోను ఆదేశించింది. ఈ మేరకు నియంత్రణ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇటీవల ఇండిగో (IndiGo)కు చెందిన ఏ321 విమానం తోక భాగం రన్‌వేను తాకింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఇలాంటి ఘటన నాలుగుసార్లు చోటుచేసుకుంది. దీంతో డీజీసీఏ ఎయిర్‌లైన్‌పై ప్రత్యేక ఆడిట్‌ చేపట్టింది. ఈ తనిఖీల్లో సంస్థ కార్యకలాపాలు, ఇంజినీరింగ్‌, శిక్షణ, ఫ్లైట్‌ డేటా మానిటరింగ్‌ వంటి విధానాల డాక్యుమెంటేషన్‌ను పరిశీలించింది. ఈ డాక్యుమెంటేషన్‌లో కొన్ని వ్యవస్థీకృత లోపాలు ఉన్నట్లు డీజీసీఏ (DGCA) గుర్తించింది.

గవర్నర్‌ను వదిలేసి వెళ్లిపోయిన ఎయిర్‌ఏషియా విమానం..!

దీనిపై వివరణ ఇవ్వాలని ఆ మధ్య ఇండిగోకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీంతో ఎయిర్‌లైన్‌ తమ స్పందనను సమర్పించింది. దీన్ని పలు స్థాయిల్లో పరిశీలించిన డీజీసీఏ.. ఇండిగో స్పందనతో సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలోనే విమానయాన సంస్థకు రూ.30లక్షల జరిమానా విధిస్తున్నట్లు డీజీసీఏ తాజా ప్రకటనలో వెల్లడించింది. అంతేగాక, డీజీసీఏ నిబంధనలు, ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మానుఫ్యాక్చరర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా తమ డాక్యుమెంట్లు, ప్రక్రియలను సవరించుకోవాలని ఇండిగోను ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని