Mangaluru Blast: మంగళూరులో ఆటోరిక్షా పేలుడు ఉగ్రవాద చర్యే

శనివారం మంగళూరులో ఓ ఆటోలో జరిగిన పేలుడు ఉగ్రవాద చర్యేనని కర్ణాటక డీజీపీ ధ్రువీకరించారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోందని హోంమంత్రి అరాగా జ్ఞానేంద్ర తెలిపారు.

Published : 20 Nov 2022 11:42 IST

మంగళూరు: కర్ణాటక తీర ప్రాంత నగరం మంగళూరులో శనివారం సాయంత్రం ఆటోరిక్షాలో జరిగిన చిన్నపాటి పేలుడు ఉగ్రవాద చర్యేనని ఆ రాష్ట్ర డీజీపీ ప్రవీణ్‌ సూద్‌ ఆదివారం ధ్రువీకరించారు. పెద్ద ఎత్తున నష్టం కలగజేయాలన్న దురుద్దేశంతోనే దుండగులు ఈ చర్యకు ఒడిగట్టారని వెల్లడించారు. దీనిపై లోతైన విచారణ జరపుతున్నామని తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థల సాయం కూడా తీసుకుంటున్నామన్నారు. ఈ విషయాన్ని కర్ణాటక హోంమంత్రి అరాగా జ్ఞానేంద్ర సైతం ధ్రువీకరించారు.

మంగళూరులో శనివారం సాయంత్రం ఓ ఆటోరిక్షాలో పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్‌ సహా ఓ ప్రయాణికుడు గాయపడ్డారు. అయితే, తొలుత ఇది పేలుడా.. లేక అగ్నిప్రమాదమా.. ఎవరికీ అర్థం కాలేదు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న నగర పోలీస్‌ కమిషనర్‌ శశి కుమార్‌.. ఆటోలో మంటలంటుకున్నాయని.. భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. పేలుడు అని ధ్రువీకరించడానికి ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నిపుణులతో పాటు ప్రత్యేక బృందం దీనిపై దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు. తాజాగా ఇది ఉగ్రవాద చర్యేనని డీజీపీ ధ్రువీకరించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని