వారికి కూడా అవగాహన కల్పించాలి..

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల వెల్లడించిన అభిప్రాయంపై భాజపా ఎంపీ మీనాక్షి లేఖి స్పందించారు. నాదెళ్ల వ్యాఖ్యలపై మీనాక్షి ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ..

Published : 14 Jan 2020 19:07 IST

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల వెల్లడించిన అభిప్రాయంపై భాజపా ఎంపీ మీనాక్షి లేఖి స్పందించారు. నాదెళ్ల వ్యాఖ్యలపై మీనాక్షి ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘అక్షరాస్యులకు కూడా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనడానికి ఇది ఒక సరైన ఉదాహరణ. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్థాన్‌లో వేధింపులకు గురైన మైనారిటీలకు తప్పక అవకాశాలు కల్పించడమే సీఏఏ తీసుకురావడానికి కారణం. అయినా అమెరికాలో యాజిదీలకు అవకాశం ఇచ్చినట్లుగా సిరియా నుంచి వచ్చిన ముస్లింలకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు’ అని పేర్కొటూ ట్వీట్‌లో ఆశ్యర్యం వ్యక్తం చేశారు. 

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల స్పందించిన విషయం తెలిసిందే.  ‘భారత్‌లో ఈ పరిస్థితులు విచారకరం. ఇది మంచిది కాదు. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చే వలసదారుడు ఇన్ఫోసిస్‌ సీఈవో అయితే చూడాలని ఉంది’ అని న్యూయార్క్‌లో ఓ కార్యక్రమంలో పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని