పదవీ విరమణ తర్వాత జడ్జీలకు రెండేళ్ల విరామం ఉండాలి
సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీలకు పదవీవిరమణ తర్వాత రెండేళ్ల పాటు ‘కూలింగ్ ఆఫ్’ కాలం ఉండేలా ఆదేశాలివ్వాలని బాంబే న్యాయవాదుల సంఘం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది.
ఆ తర్వాతే వారు రాజకీయ పదవులు చేపట్టాలి
సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాదుల సంఘం
దిల్లీ: సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీలకు పదవీవిరమణ తర్వాత రెండేళ్ల పాటు ‘కూలింగ్ ఆఫ్’ కాలం ఉండేలా ఆదేశాలివ్వాలని బాంబే న్యాయవాదుల సంఘం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. ఈ విరామం ముగిశాకే వారు గవర్నర్ వంటి రాజకీయ పదవులను చేపట్టేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. న్యాయమూర్తులు ఇలాంటి పదవులను స్వీకరించడం వల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు నెలకొంటున్నాయని పేర్కొంది. బాంబే న్యాయవాదుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అహ్మద్ మెహ్దీ అబ్దీ సోమవారం ఈ పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈ ఏడాది ఫిబ్రవరి 12న నియమితులయ్యారని ఆయన గుర్తుచేశారు. అందువల్లే తాము పిటిషన్ వేసినట్లు తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ పి.సదాశివం కూడా కేరళ గవర్నర్‌గా పనిచేశారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి సస్పెండ్
-
ODI WC 2023: హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. మేమంతా ఫిదా: పాక్ క్రికెటర్
-
Srinivas Goud: మోదీ క్షమాపణ చెప్పి సభలో మాట్లాడాలి: శ్రీనివాస్‌గౌడ్
-
Siddharth: దానివల్ల మా సినిమాకు ఎంతో నష్టం.. ప్రెస్‌మీట్ అడ్డుకోవడంపై సిద్ధార్థ్
-
World Culture Festival : మానసిక అనారోగ్యం అనేది అతి పెద్ద సమస్య : శ్రీశ్రీ రవిశంకర్
-
Vizag: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పెట్టె.. అందులో ఏముందో?