బిహార్‌లో గంగానదిపై వంతెన కూల్చివేత!

బిహార్‌లోని భాగల్‌పుర్‌ జిల్లాలో గంగానదిపై నిర్మిస్తున్న అగువానీ - సుల్తాన్‌గంజ్‌ వంతెన ఆదివారం ఒక్కసారిగా నదిలోకి కూలిపోయింది.

Updated : 05 Jun 2023 11:58 IST

బిహార్‌లోని భాగల్‌పుర్‌ జిల్లాలో గంగానదిపై నిర్మిస్తున్న అగువానీ - సుల్తాన్‌గంజ్‌ వంతెన ఆదివారం ఒక్కసారిగా నదిలోకి కూలిపోయింది. ఈ సందర్భంగా ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. డిజైనులో లోపాలు ఉన్నందున నిపుణుల సూచన మేరకు కూల్చివేసినట్లు వెల్లడించారు. భాగల్‌పుర్‌, ఖగడియా జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్న ఈ వంతెన పిల్లర్లు గత ఏప్రిల్‌ నెలలో తుపాను కారణంగా కొంతభాగం దెబ్బతిన్నాయి. బిహార్‌ ప్రభుత్వం వంతెన నిర్మాణానికి రూ.1,717 కోట్లు కేటాయించింది. 2015లో నీతీశ్‌కుమార్‌ శంకుస్థాపన చేసిన ఈ నిర్మాణం 2020 నాటికి పూర్తికావాల్సి ఉండగా, ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. వంతెన కూలుతున్న సమయంలో స్థానికులు ఆ దృశ్యాలను వీడియోల్లో బంధించి వైరల్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని