Vande Bharat Express: ఆదరణలో అగ్రస్థానంలో కాసర్‌గోడ్‌ వందేభారత్‌

దేశంలో ప్రస్తుతం 23 జతల వందేభారత్‌ రైళ్లు నడుస్తుండగా వాటిలో కేరళలోని కాసర్‌గోడ్‌-తిరువనంతపురం మధ్య ఇటీవల పట్టాలెక్కిన రైలు ప్రయాణికుల ఆదరణలో అగ్రస్థానాన నిలుస్తోంది.

Updated : 30 Jun 2023 07:16 IST

సగటు ఆక్యుపెన్సీ 183%

దిల్లీ: దేశంలో ప్రస్తుతం 23 జతల వందేభారత్‌ రైళ్లు నడుస్తుండగా వాటిలో కేరళలోని కాసర్‌గోడ్‌-తిరువనంతపురం మధ్య ఇటీవల పట్టాలెక్కిన రైలు ప్రయాణికుల ఆదరణలో అగ్రస్థానాన నిలుస్తోంది. దీని సగటు ఆక్యుపెన్సీ 183% ఉందని రైల్వే వర్గాలు ప్రకటించాయి. తిరువనంతపురం-కాసర్‌గోడ్‌ రైలు 176%తో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత గాంధీనగర్‌-ముంబయి సెంట్రల్‌ (134%), ముంబయి సెంట్రల్‌-గాంధీనగర్‌ (129%), రాంచీ-పట్నా (127%), న్యూదిల్లీ-వారణాసి (124%), ముంబయి-శోలాపుర్‌ (111%), దేహ్రాదూన్‌-అమృత్‌సర్‌ (105%) వందేభారత్‌ రైళ్లు నిలుస్తున్నాయి. ఒక స్టేషన్‌ నుంచి ఒక స్టేషన్‌కు తీసుకునే టికెట్‌ను ఒక బుకింగ్‌గా, అక్కడి నుంచి మరో స్టేషన్‌ వరకు టికెట్‌ జారీ అయితే రెండో బుకింగ్‌గా లెక్కిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని