Covid: 10 మంది కుటుంబీకులను కోల్పోయా..
ప్రాణాంతక కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి సంకోచం లేకుండా టీకా
అమెరికా సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి సంకోచం లేకుండా టీకా తీసుకోవాలని అమెరికా సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి స్పష్టం చేశారు. కొవిడ్ బారిన పడి.. అమెరికా, భారత్‌లలో ఉంటున్న తన కుటుంబసభ్యులు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన తెలిపారు. అమెరికన్లు టీకా తీసుకుని తమను తాము కాపాడుకోవాలని చెబుతూ ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. అగ్రశ్రేణి భారతీయ-అమెరికన్ ఫిజీషియన్ అయిన డాక్టర్ మూర్తి కొవిడ్‌పై తప్పుడు సమాచార వ్యాప్తికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్వేతసౌధం వద్ద గురువారం మాట్లాడారు. ఎవరైనా వైద్య, ఆరోగ్య సమాచారాన్ని ఇతరులతో పంచుకునే ముందు దానికి శాస్త్రీయ ఆధారాలున్నాయా? అన్నది సరిచూసుకోవాలని కోరారు. ఇంతవరకు 16 కోట్ల మంది అమెరికన్లు వ్యాక్సిన్లు పొందడం శుభసూచకమన్నారు. ‘‘అలాగని మనమంతా కష్టాల నుంచి బయటపడినట్లు కాదు. కోట్లాది అమెరికన్లు ఇంకా కొవిడ్ నుంచి రక్షణ పొందలేదు. వ్యాక్సిన్ పొందనివారిలో ఎక్కువగా ఇన్ఫెక్షన్లు కనిపిస్తున్నాయి’’ అని డాక్టర్ మూర్తి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Tirumala Brahmothsavalu: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం
-
AP Assembly: ఎసైన్డ్ భూములను 20 ఏళ్ల తర్వాత బదలాయించుకోవచ్చు
-
పుంగనూరు కేసులో కుమారుడికి బెయిల్ రాలేదని.. తల్లి ఆత్మహత్యాయత్నం
-
Supreme Court: అరుదైన ఘట్టం.. సంజ్ఞల భాషలో సుప్రీంకోర్టులో వాదన
-
TS TET Results: రేపు టెట్ ఫలితాలు