Indian Navy: కొచ్చిలో కుప్పకూలిన నిఘా ఎయిర్‌క్రాఫ్ట్‌

భారత నేవీకి చెందిన రిమోట్‌లీ పైలెటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (RPA) కొచ్చిలోని ఐఎన్‌ఎస్‌ గరుడ బేస్‌ వద్ద కూలిపోయింది. 

Updated : 19 Mar 2024 01:39 IST

దిల్లీ: ఇండియన్‌ నేవీ (Indian Navy)కి చెందిన రిమోట్‌లీ పైలెటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (RPA) కొచ్చిలో కూలిపోయింది. ఐఎన్‌ఎస్‌ గురుడ (INS Garuda) బేస్‌ వద్ద ఈ ఘటన జరిగిందని నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. రోజువారీ శిక్షణలో భాగంగా ఐఎన్‌ఎస్‌ గరుడ రన్‌వే నుంచి ఒక మైలు దూరంలో ఎయిర్‌క్రాఫ్ట్‌ సెర్చర్‌ కూప్పకూలినట్లు తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ఎటువంటి ఆస్తినష్టం చోటుచేసుకోలేదని పేర్కొంది. ఆర్‌పీఏ కూలిన వెంటనే ప్రత్యేక బృందం రంగంలోకి దిగిందని, దర్యాప్తు చేపట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. పైలెట్‌ లేకుండా నడిచే ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిఘా కోసం ఉపయోగిస్తారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని