IMD: మన వాతావరణ అంచనా వ్యవస్థలు ప్రపంచంలోనే అత్యుత్తమం: రిజిజు

వాతావరణంలో మార్పుల్ని కచ్చితంగా అంచనా వేయడంలో కీలక పాత్ర పోషించే డాప్లర్‌ రాడార్ల సంఖ్యను వచ్చే మూడేళ్లలో 68కి పెంచనున్నట్టు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు.

Updated : 26 Jul 2023 15:47 IST

దిల్లీ: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ(IMD) పనితీరుపై కేంద్ర భూ విజ్ఞానశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు(Kiren Rijiju) కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో వాతావరణ పరిస్థితులను అంచనా వేసే వ్యవస్థలు కొన్నేళ్లుగా కచ్చితమైన ఫలితాలతో ప్రపంచ దేశాలకన్నా అత్యుత్తమంగా పనిచేస్తున్నాయన్నారు. మనం విపత్తులను నిరోధించలేకపోయినప్పటికీ.. భారత వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను పాటించడం ద్వారా తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపారు.  

ప్రభుత్వంపై విపక్షాల అవిశ్వాస తీర్మానం.. అనుమతించిన స్పీకర్‌

వాతావరణ మార్పుల(Climate change) నేపథ్యంలో ఐఎండీ పాత్ర అత్యంత కీలకంగా మారిందన్నారు. వాతావరణంలో మార్పులను కచ్చితంగా అంచనా వేయడంలో కీలక పాత్ర పోషించే డాప్లర్‌ రాడార్ల సంఖ్యను దాదాపు రెట్టింపు చేస్తామన్న ఆయన.. ప్రస్తుతం 35గా ఉన్న సంఖ్యను వచ్చే మూడేళ్లలో 68కి పెంచనున్నట్టు తెలిపారు. 2014 నుంచి ఐఎండీ అద్భుతంగా పనిచేస్తోందన్న ఆయన.. బిపర్‌ జోయ్‌ వంటి తుపానులను కచ్చితంగా ట్రాక్‌ చేసిందంటూ ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని