Guinness World Record: 9 గంటలు.. 140 భాషల్లో పాటపాడి గిన్నిస్‌ రికార్డు

కేరళకు చెందిన సుచేతా సతీశ్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. 9 గంటల వ్యవధిలో 140 భాషల్లో పాటపాడి గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకున్నారు.

Published : 07 Jan 2024 18:33 IST

దుబాయ్: కేరళకు చెందిన సుచేతా సతీశ్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. దుబాయ్‌లో గతేడాది నవంబర్‌ 24న జరిగిన కాప్‌-28 వాతావరణ సదస్సు వేదికగా 140 భాషల్లో పాటలు పాడారు. ఆమె అద్భుత ప్రదర్శనకు అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు. ఆమె సంగీత నైపుణ్యం శ్రోతలను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన గిన్నిస్‌ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఆమెకు అవార్డును బహూకరించారు.  తాజాగా ఆ విషయాన్ని సుచేతా సతీశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు.  కాంప్‌-28కి హాజరైన 140 దేశాలకు ప్రతీకగా 140 భాషల్లో పాడినట్లు ఆమె వివరించారు. ‘‘ దేవుడి దయతోనే ఈ రికార్డు సాధించాను. 9 గంటల్లో 140 భాషల్లో పాడటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. నా వెన్నంటి నిలుస్తూ మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు’’ అని సుచేతా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని