Anand Mahindra: ఆ సంస్థలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధం: ఆనంద్ మహీంద్రా

నీటిని శుభ్రపరిచే సాంకేతికత గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ఓ వీడియోను షేర్ చేశారు.  

Updated : 02 Feb 2024 16:00 IST

ముంబయి: కొత్త విషయాలను పంచుకోవడంలోనూ, సృజనాత్మకతను ప్రోత్సహించడంలోనూ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ముందుంటారు. తాజాగా ఓ కొత్త సాంకేతికత ఆయన దృష్టిలో పడింది. ఒక అటానమస్‌ రోబో చకచకా నదిని శుభ్రం చేస్తున్న వీడియోను ఆయన సోషల్‌ మీడియాలో షేర్ చేశారు.

‘‘నదులను శుభ్రపరిచే ఈ రోబో చైనాలో తయారైనట్లు  కనిపిస్తోంది. ఇలాంటి రోబోను మన దగ్గర త్వరగా రూపొందించుకోవాలి. వీటిని ఏ స్టార్టప్‌ అయినా రూపొందిస్తుంటే పెట్టుబడి పెట్టడానికి సిద్ధం’’ అని మహీంద్రా తన పోస్టులో రాసుకొచ్చారు. ఇలాంటి పరికరాలు అత్యంత అవసరమని, నీటితో పాటు పర్వత ప్రాంతాల్లో పేరుకుపోతున్న చెత్తను ఏరివేయడానికి ఉపయోగపడతాయని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. నీటిని శుభ్రం చేసే రోబోల తయారీపై ఇప్పటికే మన దేశానికి చెందిన క్లియర్‌ బాట్ స్టార్టప్‌ పని చేస్తోందని మరో నెటిజన్‌ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని