Anand Mahindra: రోడ్డుపై సరిగమలు.. ఐడియా అద్భుతమన్న మహీంద్రా..!

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra) షేర్ చేసిన వీడియో ఒకటి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ వీడియోలో దేని గురించి ఉందంటే..? 

Published : 26 Jul 2023 11:34 IST

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra) ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెల్లడిస్తుంటారు. తాజాగా ఆయన హంగరీ(Hungary)లోని మ్యూజికల్ రోడ్డు(musical road) గురించి నెటిజన్లకు పరిచయం చేశారు. అలాగే వినూత్న ఆలోచన గురించి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీకి వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేశారు. 

పాక్‌ ప్రియుణ్ని పెళ్లాడిన భారత మహిళ

‘ఈ ఆలోచన అద్భుతం.  మన జాతీయ రహదారులు కూడా ఇలా సంగీతం వినిపించేలా నితిన్‌ గడ్కరీ(Nitin Gadkari) చర్యలు తీసుకుంటారని నేను భావిస్తున్నారు. రహదారిపై ఒక వాహనం తగిన వేగంతో ప్రయాణిస్తుంటే.. ఏ పాట, ఏ సంగీతం వినిపించాలనేది ఎంచుకోవడమే ఇక్కడ కష్టమైన విషయం. అయితే అది రాష్ట్రాలను బట్టి మారుతుండొచ్చని నేను అనుకుంటున్నాను’ అని మహీంద్రా(Anand Mahindra) ఫన్నీగా రాసుకొచ్చారు. ఆ  వీడియోలో ఒక కారు సరైన వేగంతో వెళ్తుండగా.. వినసొంపైన సంగీతం వినిపిస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. కొందరు సరదాగా పోస్టులు పెట్టగా..  ఈ పాటల కంటే మెరుగైన రోడ్లు, పాదాచారుల కోసం తగిన సదుపాయాలకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని మరికొందరు కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని