Satya Nadella: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా సత్యనాదెళ్ల
మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల నియమితులయ్యారు. మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా
వాషింగ్టన్: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ బోర్డులో కీలక మార్పులు జరిగాయి. ప్రస్తుత సీఈవో సత్యనాదెళ్లకు మరిన్ని కీలక అధికారాలు కట్టబెట్టారు. ఆయన్ను బోర్డు ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ మేరకు ఏకగ్రీవంగా సత్య నాదెళ్ల పేరుకు ఆమోదం తెలిపారు. దీంతో బోర్డు అజెండాను నిర్ణయించే అధికారం ఆయనకు దక్కనుంది. ‘‘వ్యూహాత్మక అవకాశాలను దక్కించుకొనేందుకు, కీలక ఇబ్బందులను గుర్తించేందుకు ఆయనకు వ్యాపారంపై ఉన్న అవగాహన బాగా ఉపయోగపడుతుంది’’ అని మైక్రోసాఫ్ట్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న జాన్ థామ్సన్‌ను స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించింది.
2014లో స్టీవ్ బామర్ నుంచి సత్య నాదెళ్ల సీఈవో బాధ్యతలను స్వీకరించారు. ఆయన వచ్చాక మైక్రోసాఫ్ట్‌లో కీలక మార్పులు చోటు చేసుకొన్నాయి. కొత్తతరం టెక్నాలజీ వైపు కంపెనీని నడిపించారు. అంతేకాకుండా క్లౌడ్ కంప్యూటింగ్ రంగంపై కూడా కంపెనీ విస్తృతంగా పనిచేసింది. దీంతో మొబైల్ రంగంపై ఎక్కువ దృష్టిపెట్టింది. అప్పటికే ఈ విభాగంలో ఆపిల్, గూగుల్ పనిచేస్తున్నాయి. 1975లో ప్రారంభించిన మైక్రోసాఫ్ట్‌లో నాదెళ్ల బాధ్యతలు చేపట్టాక భారీగా మార్పులు చోటు చేసుకొన్నాయి. చాలా కాలం పాటు కంపెనీ పర్సనల్ కంప్యూటర్ల సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలను తయారు చేయడంపైనే దృష్టిపెట్టింది. కానీ, సత్య నాదెళ్ల మొబైల్ రంగం వైపు కూడా సంస్థను నడిపించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WT20 WC 2023: మహిళల టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా షెడ్యూల్ ఇదే
-
Crime News
Rajasthan: పెట్రోల్ ట్యాంకర్లో మద్యం అక్రమ రవాణా..!
-
World News
Australia: డాల్ఫిన్లతో ఈతకని దిగి.. సొర చేపకు చిక్కి..!
-
Sports News
Gill: ‘శుభ్‌మన్.. నాగ్‌పుర్ ఏదో చెబుతోంది చూడు’’: ఉమేశ్ యాదవ్ ఫన్నీ ట్వీట్
-
World News
Wikipedia: పాక్‌లో వికీపీడియాపై నిషేధం.. స్పందించిన వికీమీడియా
-
General News
Rushikonda: బోడికొండకు కవరింగ్.. జర్మన్ టెక్నాలజీతో జియో మ్యాటింగ్