kashmir: రెండ్రోజుల్లో మూడు ఉగ్రదాడులు..!

స్వాతంత్ర్య దినోత్సవం నాటి నుంచి కశ్మీర్‌లో ఉగ్రమూక మళ్లీ పేట్రేగిపోతోంది. కేవలం 48 గంటల వ్యవధిలో మూడు ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఓ హిందూ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు

Published : 16 Aug 2022 14:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్వాతంత్య్రదినోత్సవం నాటి నుంచి కశ్మీర్‌లో ఉగ్రమూక మళ్లీ పేట్రేగిపోతోంది. కేవలం 48 గంటల వ్యవధిలో మూడు ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఓ హిందూ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెందగా మరొ ముగ్గురు గాయపడ్డారు. నేడు దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లాలోని ఛోటేగావ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఇద్దరు సోదరులపై కాల్పులు జరిపారు. బాధితులు గ్రామానికి చెందిన సునీల్‌ కుమార్‌, పింటూ కుమార్‌లుగా గుర్తించారు. వీరిలో సంఘటనా స్థలంలోనే సునీల్‌ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన పింటును ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన ప్రదేశాన్ని భద్రతా దళాలు అదుపులోకి  తీసుకొని ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్‌పోలీస్‌ ట్విటర్‌ హ్యాండిల్‌లో వెల్లడించారు. 24 గంటల వ్యవధిలో కశ్మీర్‌ లోయలో మైనార్టీలపై జరిగిన రెండోదాడి ఇది.

స్వాతంత్య్రదినోత్సవం రోజున బుద్గామ్‌లోని గోపాల్‌ పోరా ఛాడూరా వద్ద ఉగ్రవాదులు గ్రనేడ్‌తో దాడి చేశారు.  ఈ ఘటనలో కరణ్‌ కుమార్‌ సింగ్‌ అనే వ్యక్తి గాయపడ్డాడు. అతడిని శ్రీనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి అతడి పరిస్థితి నిలకడగా ఉంది.  మరోవైపు శ్రీనగర్‌లోని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌పై కూడా  ఉగ్రవాదులు గ్రనేడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో పోలీస్‌ సిబ్బంది ఒకరు గాయపడ్డారు. అతడిని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని