Metro trains: అక్కడ మెట్రో రైళ్లో ప్రయాణించాలంటే ముఖం చూపిస్తే చాలట

రష్యా రాజధాని మాస్కోలో 250 మెట్రో స్టేషన్లకుపైగా  ‘ఫేస్‌పే’  ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు అక్కడి మెట్రో అధికారులు. ‘ది గార్డియన్‌’ అనే బ్రిటిష్‌ న్యూస్ పేపర్‌ నివేదిక ప్రకారం..  ప్రపంచంలో ఫేషియల్ మెట్రో ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని ఇక్కడే ఎక్కువగా వాడుతున్నారట. ర

Published : 19 Oct 2021 10:49 IST


మాస్కో: సాధారణంగా మెట్రో ఎక్కాలంటే టికెట్‌ తీసుకుంటాం లేదా స్మార్ట్‌ కార్డుని వినియోగిస్తాం. మరిప్పుడు రష్యాలో రాజధాని మాస్కోలో మెట్రో రైళ్లు ఎక్కాలంటే టికెట్‌ ఏమీ అవసరం లేదట. మన ముఖాన్ని చూపిస్తే చాలు మెట్రోలో ప్రయాణించొచ్చు. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో రష్యా ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. తాజాగా రష్యా రాజధాని మాస్కోలో 240 మెట్రో స్టేషన్లలో ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రపంచంలో ఫేషియల్ మెట్రో ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని రష్యాలోనే ఎక్కువగా వాడుతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. రవాణా సౌకర్యాన్ని మరింత సులభతరం చేసేందుకు, మళ్లీ రష్యాలో విరుచుకుపడుతోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మెట్రో అధికారులు ఈ ‘ఫేస్ పే’ సాంకేతికతను ప్రారంభించారు.
ఫేస్‌ పే ఎలా పనిచేస్తుందంటే..
‘ఫేస్‌ పే’ ద్వారా మెట్రోలో ప్రయాణించాలనుకునే వారు ముందుగా వారి ఫొటోలను బ్యాంక్‌ ఖాతాలకు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆపై ఆ బ్యాంకు అకౌంట్లను మాస్కో మెట్రో యాప్ ద్వారా అనుసంధానం చేసుకోవాలి. తరువాత మెట్రో స్టేషన్‌లో ఉన్న కెమెరాలకు ముఖాన్ని చూపించి మెట్రోలో ప్రయాణంచవచ్చు. ఈ విషయంపై ‘రష్యా లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌’ అధికారులు మాట్లాడుతూ.. ఫేస్‌పే వినియోగించే ప్రయాణికుల ఫోటోలు ప్రభుత్వ ఐటీ శాఖ ఆధీనంలో ఉంటాయన్నారు. ఇక ఫొటోల భద్రత విషయానికొస్తే.. యూనిఫైడ్‌ డేటా స్టోరేజ్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌లో భద్రంగా ఉంటాయని, మెరుగైన సేవలను ప్రయాణికులకు అందించేందుకు ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రాబోయే రెండు మూడేళ్లలో ఈ ‘ఫేస్‌పే’ని నిత్యం వాడే వారి సంఖ్య 10-15శాతం వరకూ పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కొవిడ్‌ ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకొని అక్కడి ప్రయాణికులను ఈ బయోమెట్రిక్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అక్కడి అధికారులు ప్రయాణికులను విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఈ సాంకేతిక ఉపయోగంపై అక్కడ భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తమ సమచారం భద్రతపై పలు సందేహాలను లేవనెత్తుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని