Mumbai: ‘ఆరు చోట్ల బాంబులు పెట్టాం..’: ముంబయికి బెదిరింపులు

Mumbai: ముంబయికి బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆరు చోట్ల బాంబులు పెట్టినట్లు దుండగులు బెదిరించారు.

Updated : 02 Feb 2024 10:09 IST

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయి (Mumbai)కి మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threats) రావడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం ఉదయం ట్రాఫిక్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. నగర వ్యాప్తంగా ఆరు ప్రదేశాల్లో బాంబులు పెట్టినట్లు ఆ వ్యక్తి బెదిరించాడు.

దీంతో ముంబయి పోలీసులు, క్రైమ్‌ బ్రాంచ్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు, ఫోన్‌ చేసిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ట్రాఫిక్‌ పోలీస్‌ హెల్ప్‌లైన్‌కు చెందిన వాట్సప్‌ నంబరుకు ఈ కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జ్ఞానవాపిలో తెరచుకున్న వ్యాస్‌జీ మందిరం

ముంబయికి గతంలోనూ పలుమార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. నూతన సంవత్సర వేడుకల వేళ ఓ వ్యక్తి ముంబయి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి.. పలు ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు చెప్పారు. అంతకుముందు కూడా ఆర్‌బీఐ ఆఫీసులు సహా పలు బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. అయితే అవన్నీ నకిలీవేనని తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని