Mumbai: ముంబయి అన్‌లాక్‌.. ఎప్పటినుంచంటే..?

దేశంలో కరోనా మూడో ముప్పు క్రమంగా అదుపులోకి వస్తోంది. ఈ ఒమిక్రాన్ వేవ్‌తో ఇబ్బంది పడిన ప్రధాన నగరాలు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నాయి.

Published : 08 Feb 2022 14:30 IST

ముంబయి: దేశంలో కరోనా మూడో ముప్పు క్రమంగా అదుపులోకి వస్తోంది. ఈ ఒమిక్రాన్ వేవ్‌తో ఇబ్బంది పడిన ప్రధాన నగరాలు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నాయి. దాంతో ప్రభుత్వాలు.. కొవిడ్ ఆంక్షలను పక్కనపెడుతున్నాయి. కానీ, ప్రజలు మాత్రం నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. తాజాగా ముంబయిలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బహిరంగ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని బీఎంసీ నిర్ణయించింది. అలాగే నగరాన్ని అన్‌లాక్‌ చేసేందుకు సిద్ధమైంది. 

‘ముంబయి వాసులకు శుభవార్త. ఈ నెలాఖరులో ముంబయిని అన్‌లాక్‌ చేయనున్నాం. ఈ మేరకు మేం నిర్ణయం తీసుకున్నాం.  కానీ ప్రజలంతా తప్పకుండా మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి’ అని ముంబయి మేయర్ కిశోరీ పెడ్నేకర్ మీడియాకు వెల్లడించారు. మూడోవేవ్‌ సమయంలో ఆ నగరంలో కరోనా కొత్త కేసులు భారీగా పెరిగి, క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో బీఎంసీ నుంచి ఈ ప్రకటన వెలువడింది. నిన్న అక్కడ 356 కేసులొచ్చాయి. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా 6 వేలపైగా కరోనా కొత్త కేసులున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని