NDA అంటే ‘నో డేటా అవైలబుల్’.. కేంద్రంపై శశి థరూర్‌ విమర్శలు

గత పదేళ్లలో దేశంలో పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయం తగ్గిపోయిందని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ అన్నారు.

Updated : 07 Feb 2024 17:32 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ (Union Budget 2024)లో పేదల సంక్షేమాన్ని విస్మరించిందని కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) ఆరోపించారు. కేవలం మూలధన వ్యయంపైనే దృష్టి సారించిందని విమర్శించారు. దేశంలో పేదరికాన్ని అంచనా వేసేందుకు కేంద్రం వద్ద సరైన శాస్త్రీయ గణాంకాలు లేవన్నారు. బుధవారం లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను ఆయన తప్పుబట్టారు. ఎన్డీయే అంటే ‘నో డేటా అవైలబుల్‌’ అని విమర్శించారు. 

మీకు 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నా.. కాంగ్రెస్‌కు మోదీ చురకలు

‘‘గత పదేళ్లలో పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయం తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం ‘ట్రికిల్‌ డౌన్‌ ఎకానమిక్స్‌’ని పాటిస్తోంది. సంపన్నులు ఖర్చు చేస్తే.. దానివల్ల పేద, మధ్యతరగతి ప్రజలు ప్రయోజనం పొందుతారని భావిస్తోంది. ఆర్థిక వ్యవస్థలో సామాన్యుడు భాగస్వామిగా ఉండాలి. వారికి అవసరమైన ఉత్పత్తులను తయారుచేయాలి. కానీ, కేంద్రం మూల ధన వ్యయంపైనే దృష్టి సారిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను, సామాన్యుడిని పట్టిపీడిస్తున్న సంక్షోభానికి పరిష్కారం చూపలేని బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ విషయాన్ని సభ గ్రహించాలి’’ అని థరూర్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని