Rujira Narula Banerjee: అభిషేక్‌ బెనర్జీ భార్యకు చుక్కెదురు.. విమానాశ్రయంలో అడ్డగింత

తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee) భార్యకు విమానాశ్రయంలో చుక్కెదురైంది. ఆమె విదేశాలకు వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. 

Published : 05 Jun 2023 15:50 IST

దిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(Trinamool Congress) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee) భార్య రుజిరా నరులా బెనర్జీ(Rujira Narula Banerjee)ని విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆమె దేశం దాటేందుకు వారు నిరాకరించారు. పశ్చిమ్ బెంగాల్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆమె దుబాయ్‌ విమానాన్ని ఎక్కేందుకు విమానాశ్రయానికి వెళ్లారు. బొగ్గు కుంభకోణాని(Bengal coal smuggling scam)కి సంబంధించి ఈడీ(ED), సీబీఐ(CBI) రుజిరాను ఇప్పటికే పలుమార్లు విచారించాయి. తాజాగా ఈడీ ఆమెకు సమన్లు జారీ చేసింది. జూన్ 8వ తేదీన విచారణకు హాజరుకావాలని వాటిలో పేర్కొంది. 

ఈస్ట్రర్న్‌ కోల్డ్‌ఫీల్డ్‌ లిమిటెడ్‌కు చెందిన గనుల్లో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై గతేడాది సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా.. కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కుంభకోణంలో అభిషేక్‌ బెనర్జీ లబ్ధిపొందారని ఈడీ ఆరోపించింది. లబ్ధి పొందిన సొమ్మును విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అయితే ఈ అభియోగాలను అభిషేక్ ఖండించిన సంగతి తెలిసిందే.  అభిషేక్‌ తృణమూల్ అధినేత్రి, పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) మేనల్లుడు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని