Supreme Court: ఆ ‘జూ’ ఏర్పాటుకు చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయి

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(Reliance) మద్దతు ఉన్న గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ సొసైటీ(GZRRC) గుజరాత్‌లోని...

Published : 21 Aug 2022 01:46 IST

జీజడ్‌ఆర్‌ఆర్‌సీపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు

గాంధీనగర్‌: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(Reliance) మద్దతుగల గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ సొసైటీ(GZRRC) గుజరాత్‌లోని జామ్‌నగర్‌(Jamnagar)లో ఏర్పాటు చేస్తున్న జంతుప్రదర్శనశాల(Zoo) విషయంలో ఆయా అంశాలను ప్రశ్నిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు(Supreme Court) కొట్టేసింది. జూ ఏర్పాటును సవాల్‌ చేయడంతోపాటు స్థానికంగా, విదేశాల నుంచి జంతువులను తరలించడాన్ని నిషేధించాలని, జీజడ్‌ఆర్‌ఆర్‌సీ కార్యకలాపాలపై విచారణకు సిట్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ ఓ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. అంతకుముందు జీజడ్‌ఆర్‌ఆర్‌సీ తన వివరణాత్మక నివేదికను కోర్టుకు సమర్పించింది.

జీజడ్‌ఆర్‌ఆర్‌సీ కార్యకలాపాలు వివాదాస్పదంగా ఉన్నట్లు పేర్కొనడానికి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపిన సుప్రీం కోర్టు.. పిల్‌ను కొట్టేసింది. జూ ఏర్పాటు, సంబంధిత కార్యకలాపాలు, జంతువుల తరలింపునకు జీజడ్‌ఆర్‌ఆర్‌సీ చట్టబద్ధమైన అనుమతులు పొందినట్లు కోర్టు గుర్తించింది. పైగా.. ఈ ఆరోపణలు వార్తా నివేదికలపై ఆధారపడి ఉన్నాయని పేర్కొంది. ఈ ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు కనుగొనలేదని తెలిపింది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు తీర్పుపై జీజడ్‌ఆర్‌ఆర్‌సీ హర్షం వ్యక్తం చేసింది. తాము చట్టపరంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు కోర్టు గుర్తించిందన్నారు. జంతువుల సంక్షేమం, సంరక్షణ, పునరావాసానికి తాము కట్టుబడి ఉన్నామని జీజడ్‌ఆర్‌ఆర్‌సీ ఆర్గనైజేషన్ అధిపతి ధనరాజ్ నత్వానీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని