Stalin: స్టాలిన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. తమిళనాడులోకి సీబీఐకి నో ఎంట్రీ!

Tamilnadu: తమిళనాడు ప్రభుత్వం సీబీఐకి జనరల్‌ కన్సాంట్‌ను ఉపసంహరించుకుంది. ఇకపై రాష్ట్రంలోని ఏ కేసునైనా దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

Published : 14 Jun 2023 21:29 IST

చెన్నై: తమిళనాడులోని స్టాలిన్‌(Stalin) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి తలుపులు మూసివేసింది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేందుకు గతంలో సీబీఐ(CBI)కి ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో ఇకపై రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఇదే తరహా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తమిళనాడు మంత్రి వి.సెంథిల్‌ బాలాజీని మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అరెస్టు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే డీఎంకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగపరుస్తోందంటూ తీవ్రంగా ఆరోపిస్తూ ఇప్పటికే దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు సీబీఐకి జనరల్‌ కన్సెంట్‌ను ఉపసంహరించుకున్నాయి. ఆ జాబితాలో తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, కేరళ, ఝార్ఖండ్‌, పంజాబ్‌, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలు ఉండగా.. తాజాగా తమిళనాడు చేరినట్లయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని