Ranchi: భారత్‌ - ఇంగ్లాండ్‌ నాలుగో టెస్ట్‌కు పన్నూ బెదిరింపులు..!

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ మరోసారి భారత్‌కు హెచ్చరికలు జారీ చేశాడు. ఈ సారి భారత్‌-ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ను లక్ష్యంగా చేసుకొన్నాడు. 

Updated : 21 Feb 2024 12:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రాంచీలో జరగనున్న టెస్ట్‌ మ్యాచ్‌కు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఝార్ఖండ్‌ పోలీసులు మైదానానికి మరింత భద్రతను కల్పించారు. నిషేధిత సీపీఐ మావోయిస్టులు ఈ మ్యాచ్‌ సందర్భంగా అడ్డంకులు సృష్టించాలని ఓ వీడియో సందేశంలో పిలుపునిచ్చాడు. ఈ నేపథ్యంలో పన్నూపై దుర్వా పోలీస్‌ స్టేషన్‌లో ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదైంది. ఇప్పటికే  దర్యాప్తు  మొదలుపెట్టినట్లు డీఎస్పీ పీకే మిశ్రా  తెలిపారు. 

14వేల మంది రైతులు..1200 ట్రాక్టర్లు: మళ్లీ మొదలుకానున్న ‘దిల్లీ చలో’

ఇటీవల కాలంలో ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ పలు మార్లు భారత్‌ను బెదిరించాడు. గతంలో ప్రపంచకప్‌ ఫైనల్‌, ఎయిర్‌ ఇండియా విమానాలను, అమెరికా-కెనడా దేశాల్లోని భారతీయులను లక్ష్యంగా చేసుకొంటామని బహిరంగ బెదిరింపులకు దిగాడు. ఇదిలాఉంటే, సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌ (SFJ) వేర్పాటువాద సంస్థ వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్‌ సింగ్ పన్ను కూడా ఒకడు. 2007లో ఈ సంస్థను స్థాపించగా.. 2019లో భారత్‌ దాన్ని నిషేధించింది. నాటి నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టిలో ఉన్నాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద గురుపత్వంత్‌ను కూడా భారత ప్రభుత్వం 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడిపై 2021లో నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. ఇటీవల అతడి భూమి, ఇంటిని జాతీయ దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని