కుమారుని మరణవార్తతో ఆగిన తల్లి గుండె

విదేశాల్లో ఉంటున్న కుమారుని మరణవార్త విని కోమాలోకి వెళ్లిన తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.  ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది.

Updated : 29 Jul 2023 16:25 IST

చండీగఢ్‌: విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లిన కుమారుడి మరణంతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.  ఇప్పుడు అదే కుటుంబంలో మరో హృదయవిదారక ఘటన జరిగింది. తాజాగా కెనడా (Canda)లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న గుర్‌విందర్‌ నాథ్‌ అనే విద్యార్థిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 14న మృతి చెందాడు. కుటుంబీకులు గుర్‌విందర్‌ మరణం గురించి అతడి తల్లి నరీందర్ కౌర్ కు ముందుగా చెప్పలేదు.  శుక్రవారం రాత్రి దిల్లీ విమానాశ్రయానికి గుర్‌విందర్‌ మృతదేహాన్ని తరలించిన సంగతి నరీందర్‌ కౌర్‌కు తెలిసింది. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురై కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.  ఈ రోజు (శనివారం) ఉదయం 11 గంటలకు గుర్ విందర్‌, నరీందర్‌ కౌర్‌ అంత్యక్రియలు జరిపారు. తల్లీ, కుమారుడి మరణంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పంజాబ్‌ కు చెందిన గుర్‌విందర్‌ నాథ్‌ (24) ఒంటారియో ప్రావిన్స్‌లో పిజ్జా డెలివరీబాయ్‌గా పనిచేస్తున్నాడు. జులై 9న మిస్సిసాగా ప్రాంతంలో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లిన గుర్‌విందర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు  దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతడిని  స్థానిక ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ జులై 14న మృతి చెందినట్లు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్‌ కార్యాలయం తెలిపింది. శుక్రవారం గురువిందర్‌ మృతదేహాన్ని భారత్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు