US and Taliban: తొలిసారి అమెరికా-తాలిబన్‌ చర్చలు..!

అఫ్గాన్‌లో దళాలు ఉపసంహరణ తర్వాత తొలిసారి అమెరికా- తాలిబన్ల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు దోహాలో ఆదివారం రాత్రి ముగిశాయి.

Published : 11 Oct 2021 23:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అఫ్గాన్‌లో దళాలు ఉపసంహరణ తర్వాత తొలిసారి అమెరికా-తాలిబన్ల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు దోహాలో ఆదివారం రాత్రి ముగిశాయి. దీనిపై అమెరికా అధికారులు స్పందిస్తూ.. తాలిబన్ల పనితీరు బట్టే అమెరికా నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ చర్చలు పూర్తి రహస్యంగా.. నిర్మాణాత్మకంగా జరిగాయన్నారు. ఈ సమావేశంలో తాలిబన్లకు గుర్తింపుపై ఎటువంటి చర్చ జరగలేదని తెలిపారు.

మరోవైపు తాలిబన్ల ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘భవిష్యత్తులో అఫ్గానిస్థాన్‌కు మానవీయ సాయం అందిస్తామని  అమెరికా ప్రతినిధి తెలిపారు. దీంతో పాటు ఇతర సంస్థలు అఫ్గానిస్థాన్‌కు సాయం చేయడానికి అవసరమైన సౌకర్యాలను కూడా అమెరికా కల్పిస్తుంది’’ అని పేర్కొన్నారు. అయితే అమెరికా వైపు నుంచి దీనిపై ఎలాంటి ధ్రువీకరణ లభించలేదు.

అమెరికా ప్రతినిధి నెడ్‌ప్రైస్‌ మాట్లాడుతూ ఇరుపక్షాలు అఫ్గాన్‌ ప్రజలకు మానవీయ సాయం అందించడంపై బలంగా చర్చించాయని తెలిపారు. ఈ చర్చల్లో ఉగ్రవాదంపై అమెరికా ఆందోళనలు, అమెరికా పౌరులు సురక్షితంగా బయట పడటం వంటి అంశాలపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఐసిస్‌ ఉగ్రవాదులను సొంత బలంతోనే తరిమి కొడతామని తాలిబన్‌ ప్రతినిధి సొహైల్‌ షహీన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని