Shivaji: సుచితా డేవిడ్‌ పాల్‌ ఎవరు? నాకు కేఏ పాల్‌ తెలుసు: శివాజీ

శివాజీ, వాసుకి కీలక పాత్రల్లో నటించిన ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ వెబ్‌సిరీస్‌ ఈటీవీలో విన్‌లో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Updated : 30 Dec 2023 16:04 IST

హైదరాబాద్‌: ‘మన కోసం మనతో కొట్లాడి నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ..’ అంటున్నారు శివాజీ (Shivaji). ఆయన కీలక పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘#90s: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ (A Middle Class Biopic). వాసుకి ఆనంద్‌, మౌళి, వసంతిక, రోహన్‌, స్నేహల్‌ కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య హసన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌ తెలుగు ఓటీటీ ‘ఈటీవీ విన్‌’వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. 2024 జనవరి 5వ తేదీ నుంచి ఈ సిరీస్‌ అందుబాటులోకి రానుంది.

ఈ క్రమంలో సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ విడుదల చేశారు. శివాజీ ఇందులో లెక్కల మాస్టర్‌ చంద్రశేఖర్‌గా కనిపించనున్నారు. శివాజీ గురించి అతడి కొడుకు తన క్లాస్‌మేట్‌కు వివరించే సీన్‌తో ఆరంభమైన ట్రైలర్‌ ఆద్యంతం నవ్వులు పంచింది. చివరిలో ఇద్దరు అమ్మాయిలు వచ్చి శివాజీని పలకరిస్తూ, ‘నేను సుచిత డేవిడ్‌ పాల్‌’ అంటే, ఒక సెకను ఆలోచించిన శివాజీ ‘నాకు కేఏ పాల్ తెలుసు’ అంటూ చెప్పడం నవ్వులు పూయిస్తోంది. ఇక  మాస్టర్‌ అయిన శివాజీ తన ఇంట్లో ఎలా ఉంటాడు? కుటుంబ సభ్యులను ఎలా చూస్తాడు? ఇల్లు, స్కూల్‌లో శివాజీ పిల్లలు పడే ఇబ్బందులు ఏంటి? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే. 90వ దశకం నాటి పరిస్థితులను ప్రతిబింబించేలా సినిమాటోగ్రఫీ, సెట్స్‌ను తీర్చిదిద్దిన విధానం బాగుంది.  కేవలం రూ.1కే (రోజుకి) నాన్‌స్టాప్ వినోదాన్ని పంచే తెలుగు ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV WIN). పలు వినోదాత్మక కార్యక్రమాలు, ధారావాహికలు, వెబ్‌సిరీస్‌లు, క్లాసిక్‌ మూవీస్‌తోపాటు కొత్త కొత్త సినిమాలనూ అందిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని