A Thursday: ఆ గురువారం ఏం జరిగింది.. ఉత్కంఠగా ‘ ఏ థర్స్‌డే’ ట్రైలర్‌

యామీ గౌతమ్‌, అతుల్‌ కులకర్ణి, నేహా ధుపియా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఏ థర్స్‌డే’.

Published : 10 Feb 2022 15:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యామీ గౌతమ్‌, అతుల్‌ కులకర్ణి, నేహా ధుపియా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఏ థర్స్‌డే’. బేహ్‌జాద్‌ ఖంబాటా దర్శకత్వం వహించారు. ఈ సినిమా నేరుగా ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో ఫిబ్రవరి 17నుంచి స్ట్రీమింగ్‌కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను గురువారం విడుదల చేసింది. ఓ గురువారం జరిగే అనూహ్య సంఘటనల నేపథ్యంలో ఈ థ్రిల్లర్‌ చిత్రం రూపొందినట్టు తెలుస్తోంది. ప్లే స్కూల్‌ టీచర్‌ అయిన యామీ తన విద్యార్థుల్ని నిర్భంధించి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసే సన్నివేశాలు ఉత్కంఠ పెంచేలా ఉన్నాయి. టీచర్‌గా యామీ, పోలీసు ఆఫీసర్‌గా నేహాధుపియా అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. రోనీ స్క్రూవాలా, ప్రేమ్‌నాథ్‌ రాజగోపాలన్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో డింపుల్‌ కపాడియా, కరణ్‌వీర్‌ శర్మ తదితరులు అతిథి పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంగీతం: రోషన్‌ దలాల్‌, కైజా; కూర్పు: సుమీత్‌; మాటలు: విజయ్‌ మౌర్య.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని