Janhvi Kapoor: స్నాక్స్‌ తింటూ దొరికిన జాన్వీ కపూర్‌.. ఎలా తప్పించుకుందంటే?

అర్ధరాత్రి స్నాక్స్‌ తింటూ దొరికిపోయే స్కిట్‌తో బాలీవుడ్ నటి జాన్వీకపూర్‌ సందడి చేస్తోంది. తన అభిమానుల్ని అలరించేందుకు సీరియల్‌ డైలాగ్‌తో స్పూఫ్‌ ప్రయత్నించింది.

Published : 29 Jul 2022 02:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అర్ధరాత్రి స్నాక్స్‌ తింటూ దొరికిపోయే స్కిట్‌తో బాలీవుడ్ నటి జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) సందడి చేస్తోంది. తన అభిమానుల్ని అలరించేందుకు సీరియల్‌ డైలాగ్‌తో స్పూఫ్‌ ప్రయత్నించింది. సోషల్‌ మీడియాలో చాలా చురుకుగా ఉండే కథానాయికల్లో జాన్వీ ముందుంటుందనే విషయం తెలిసిందే. తన సినిమాల కబుర్లు, టూర్‌ విశేషాలు, ఫొటోషూట్లు.. ఇలా ఏ రోజు ఏ పని చేసినా నెట్టింట వివరాలు పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడూ వాటికి కాస్త బ్రేక్‌ ఇచ్చి, ఫన్నీ వీడియోలు చేస్తుంటుంది. అలా చేసిన ఈ ‘వాకింగ్‌’ వీడియోనే ఇప్పుడు నవ్వులు పంచుతూ, వైరల్‌గా మారింది. హెయిర్‌ స్టైలిష్ట్‌తో కలిసి జాన్వీ చేసిన యాక్టింగ్‌కు నెటిజన్లతోపాటు సినీ ప్రముఖులూ ఫిదా అయ్యారు.

ఈ వీడియోలో కనిపించిన కాన్సెప్ట్‌ ఇదీ.. జాన్వీ కపూర్‌ ఓ షెల్ఫ్‌లో ఉన్న డబ్బా తీసుకుని అందులోని ఆహారం తినే ప్రయత్నం చేస్తుంది. ఈ వ్యవహారం ఆ ఇంటి మహిళ (హెయిర్‌ స్టైలిష్ట్‌) కంటపడుతుంది. ఆమెను మభ్యపెట్టి, అక్కడ నుంచి తప్పించుకునేందుకు జాన్వీ..  ప్రముఖ హిందీ సీరియల్‌ ‘నాగిన్‌ 6’లోని డైలాగ్‌ను చెప్తుంది. ‘‘నేను నడిచేటప్పుడు సమయాన్ని చూడను. ఫలానా టైమ్‌లోనే వాకింగ్‌ చేయాలని లేదు. అందరూ నా ఫిగర్‌ను చూస్తారు. దాని కోసమే ఇలా నడుస్తా’’ అంటూ తనదైన శైలిలో స్పీచ్‌ ఇచ్చేసి, ఆ స్నాక్స్‌ డబ్బా తీసుకుంది అక్కడి నుంచి పారిపోతుంది. ఒరిజినల్‌ డైలాగ్‌ చెప్పిన నటి తేజస్వీ ప్రకాశ్‌.. జాన్వీ కపూర్‌ హావభావాలకు థ్రిల్‌ అయి, లవ్‌ ఎమోజీని జతచేసింది. ఆ సీరియల్‌ నిర్మాత ఏక్తా కపూర్‌ సైతం జాన్వీని ప్రశంసలతో ముంచెత్తారు. సినిమాల విషయాకొస్తే.. జాన్వీ నటించిన ‘గుడ్‌లక్‌ జెర్రీ’ (Goodluck Jerry) నేరుగా ఈ శుక్రవారం ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో (Disney+ Hotstar) విడుదల కానుంది. వరుణ్‌ ధావన్‌ సరసన ‘బవాల్‌’ (Bawaal), రాజ్‌కుమార్‌ రావు సరసన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ (Mr and Ms Mahi) చిత్రాలతో బిజీగా ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని