Soppana Sundari: ఓటీటీలో ఐశ్వర్య రాజేశ్‌ ‘స్వప్న సుందరి’

ఐశ్వర్య రాజేశ్‌ కీలక పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘స్వప్న సుందరి’ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

Published : 02 May 2023 21:11 IST

హైదరాబాద్‌: తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో అలరిస్తున్నారు ఐశ్వర్య రాజేశ్‌. ఎస్‌జీ చార్లెస్‌ దర్శకత్వంలో ఆమె నటించిన కామెడీ డ్రామా ‘స్వప్న సుందరి’. లక్ష్మీ ప్రియ, చంద్రమౌళి, దీపా శంకర్‌, కరుణాకరన్‌ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 14న తమిళ్‌లో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలు అందుకుంది. ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. తమిళంతో పాటు, తెలుగులోనూ మే 12వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హాట్‌స్టార్‌ కొత్త పోస్టర్‌ను పంచుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని