Good Bad Ugly: ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’తో రానున్న అజిత్‌.. అప్‌డేట్‌ ఇచ్చిన మేకర్స్‌

హీరో అజిత్‌ దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ తో సినిమా చేయనున్నారు.

Published : 14 Mar 2024 19:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కథానాయకుడు అజిత్‌తో (Ajith Kumar) సినిమా చేయనున్నట్లు మైత్రీమూవీ మేకర్స్ అధికారికంగా  ప్రకటించింది. ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ (Good Bad Ugly) టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది. అజిత్‌ సినిమాతో ఈ నిర్మాణ సంస్థ తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. విశాల్‌ ‘మార్క్‌ ఆంటోనీ’తో మంచి హిట్‌ అందుకున్న అధిక్‌ రవిచంద్రన్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. అభినందన్‌ రామానుజం సినిమాటోగ్రాఫర్‌. ‘‘అజిత్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. అధిక్‌ స్క్రిప్ట్‌ చాలా బాగా రాశారు. సినీ ప్రియులకు మంచి అనుభవాన్ని అందిస్తామన్న నమ్మకం ఉంది’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్‌ చేస్తుంది. 

అజిత్‌, అధిక్‌లు పరిశ్రమలో మంచి స్నేహితులు. ‘నేర్కొండ పార్వై’ చిత్రంతో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ సినిమాలో అధిక్‌ కీలక పాత్ర పోషించారు. ‘మార్క్‌ ఆంటోనీ’ సక్సెస్‌ మీట్‌లోనూ అజిత్‌ను గుర్తుచేసుకుంటూ అధిక్‌ మాట్లాడారు. ప్రస్తుతం అజిత్‌ మాగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో ‘విదా ముయార్చి’ చిత్రంలో నటిస్తున్నారు. త్రిష కథానాయిక. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని