Valimai postponed: అజిత్‌ ‘వాలిమై’ కూడా వాయిదా!

మొన్న ‘ఆర్‌ఆర్ఆర్‌’, నిన్న ‘రాధేశ్యామ్‌’ ఇప్పుడు ‘వాలిమై’.. సంక్రాంతి పండగకు థియేటర్లలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయనుకున్న భారీ చిత్రాలన్నీ ఒక్కొక్కటిగా వాయిదా

Published : 06 Jan 2022 23:51 IST

హైదరాబాద్‌: మొన్న ‘ఆర్‌ఆర్ఆర్‌’, నిన్న ‘రాధేశ్యామ్‌’ ఇప్పుడు ‘వాలిమై’.. సంక్రాంతి పండగకు థియేటర్లలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయనుకున్న భారీ చిత్రాలన్నీ ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. తాజాగా అజిత్‌ కథానాయకుడిగా హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాలిమై’ వాయిదా పడింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

‘‘ప్రేక్షకులు, అభిమానులు మా సంతోషానికి కారణం. క్లిష్ట పరిస్థితుల్లో వారు చూపిన సహకారం, ఎల్లలు లేని ప్రేమాభిమానాలు వల్లే ఈ డ్రీమ్‌ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశాం. వాళ్లంతా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాహంగా థియేటర్స్‌లో సినిమా చూడాలని మేము కోరుకుంటున్నాం. మా ప్రేక్షకుల భద్రత కూడా ముఖ్యమే. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న పెరుగుతున్నాయి. అధికార యంత్రాంగం ఆంక్షలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు చక్కబడే వరకూ మన చిత్రం ‘వాలిమై’ విడుదలను వాయిదా వేస్తున్నాం. వ్యాక్సిన్‌ వేయించుకోండి. మాస్క్‌ ధరించండి. జాగ్రత్తగా ఉండండి. త్వరలోనే మళ్లీ థియేటర్స్‌లో కలుద్దాం’’ -ట్విటర్‌లో వాలిమై చిత్ర బృందం

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వాలిమై’లో హ్యూమాఖురేషి కథానాయికగా నటిస్తోంది. తెలుగు నటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో బోనీ కపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని