ఈ నెల‌తో.. 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ :  బాలాదిత్య‌ 

 ఒక‌రు బుల్లితెర‌పై.. మ‌రొక‌రు వెండితెర‌పై త‌మదైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటున్నారు సోద‌రులు బాలాదిత్య‌, కౌశిక్‌. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఆలీ వ్యాఖ్యాత‌గా ఈటీవీ ప్ర‌సార‌మ‌వుతోన్న  ‘ఆలీతో స‌ర‌దాగా’ కార్య‌క్ర‌మానికి విచ్చేశారు.

Updated : 04 Jun 2021 13:20 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ఒక‌రు బుల్లితెర‌పై.. మ‌రొక‌రు వెండితెర‌పై త‌మదైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటున్నారు సోద‌రులు బాలాదిత్య‌, కౌశిక్‌. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఆలీ వ్యాఖ్యాత‌గా ఈటీవీ ప్ర‌సార‌మ‌వుతోన్న ‘ఆలీతో స‌ర‌దాగా’ కార్య‌క్ర‌మానికి విచ్చేశారు. ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది. ఇందులో త‌మ కెరీర్ ఎప్పుడు ప్రారంభ‌మైంది? ఎన్ని సినిమాల్లో న‌టించారు? త‌దిత‌ర విష‌యాలు పంచుకున్నారు. ఆలీ ప్ర‌శ్న‌ల‌కు ఈ నటులు చెప్పిన స‌మాధానాలు న‌వ్వులు పూయిస్తున్నాయి. మొద‌ట‌గా ఇంట‌స్ట్రీకి ఎవ‌రు వ‌చ్చారు? అని ఆలీ ప్ర‌శ్నించ‌గా.. నేను అంటూ జ‌వాబిచ్చాడు కౌశిక్‌. నీది? అని బాలాదిత్య‌ని అడ‌గ్గా ‘30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఈ నెల‌తో’ అంటూ సంద‌డి చేశారు బాలాదిత్య. బాల న‌టుడిగా 6  భాష‌ల్లో 41 చిత్రాల్లో  న‌టించాన‌ని చెప్పుకొచ్చారాయ‌న‌. ఓ సంద‌ర్భంలో దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు.. మంచి న‌టుడ‌వుతాన‌ని ఓ కాగితంపై రాసి ఆటోగ్రాఫ్ ఇచ్చార‌ని తెలిపారు బాలాదిత్య‌. ఈ ప్ర‌తిభావంతుల ప్ర‌స్థానం గురించి పూర్తిగా తెలియాలంటే జూన్ 7 వ‌ర‌కు ఆగాల్సిందే. అప్ప‌టి వ‌ర‌కు ఈ ప్రోమో చూడండి...


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని