Allu Arjun: భార్యకు అల్లు అర్జున్‌ స్పెషల్‌ విషెస్‌... వైరల్‌ అవుతోన్న పోస్ట్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. 

Updated : 06 Mar 2024 15:52 IST

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun), స్నేహ రెడ్డిల జంటకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ జంట సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా వీరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ తన భార్యకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘‘మన పెళ్లై 13 ఏళ్లు అయిపోయాయి. నీ వల్లే ఈ ప్రయాణం సంతోషంగా సాగుతోంది. నువ్వు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ నాకు శక్తి ఇస్తున్నావు. చివరివరకూ మన ప్రేమ ఇలానే కొనసాగాలి. హ్యాపీ యానివర్సిరీ క్యూటీ’’ అని అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. వీరి సోషల్‌మీడియా వేదికగా అభిమానులు యానివర్సిరీ విషెస్‌ తెలియజేస్తున్నారు.

అల్లు అర్జున్‌ ఇటీవల బెర్లిన్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సావాల్లో భారతీయ సినిమా తరఫున పాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆయన సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa The Rule)లో నటిస్తున్నారు. అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన ‘పుష్ప: ది రైజ్‌’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ఇది. రష్మిక కథానాయిక. ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇది విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని