Amitabh Bachchan: అభిషేక్‌ను చూసి ఆ డాన్స్‌ కాపీకొట్టా: బిగ్‌బీ

అమితాబ్‌ బచ్చన్‌ పరిచయం అవసరంలేని పేరు. ఆయన ఎందరో సినీ తారలకు మార్గదర్శి.

Published : 27 Apr 2022 11:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమితాబ్‌ బచ్చన్‌ పరిచయం అవసరంలేని పేరు. ఆయన ఎందరో సినీ తారలకు మార్గదర్శి. రాబోయే తరాలకు ఒక దిక్సూచి. వయసుతో సంబంధం లేకుండా నేటి తరం  కథానాయకులతో పోటీపడుతుంటారు ఈ హీరో. సినిమాల్లోనే కాదు సోషల్‌ మీడియాలో సైతం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు బిగ్‌బీ. ఆయనకు సోషల్‌ మీడియాలో కోట్లలో ఫాలోవర్స్‌ ఉన్నారు. తాజాగా తన సినిమాలోని ఒక పాటకు వేసిన డాన్స్‌పై ట్వీట్‌ చేశారు. అందులోని స్టెప్స్‌ చిన్నప్పుడు అభిషేక్‌ను చూసి కాపీ కొట్టానంటూ చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేస్తూ ‘ఈ పాటలో నేను వేసిన డాన్స్‌ చిన్నప్పుడు అభిషేక్‌ను చూసి కాపీ కొట్టాను. తను ఇలానే నడిచే వాడు. ఎప్పుడూ పక్కకే నడుస్తుండేవాడు’ అంటూ తన తీపి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని