Anasuya Bharadwaj: అలాంటి వారికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది: అనసూయ

‘పనీపాటా లేని వాళ్లకి బుద్ధి చెప్పే టైమ్‌ వచ్చింది’ అని పోలీసు అధికారులు తనకు చెప్పారని నటి, వ్యాఖ్యాత అనసూయ (Anasuya Bharadwaj) తెలిపారు.

Published : 09 Sep 2022 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘పనీపాటా లేని వాళ్లకి బుద్ధి చెప్పే టైమ్‌ వచ్చింది’ అని పోలీసు అధికారులు తనకు చెప్పారని నటి, వ్యాఖ్యాత అనసూయ (Anasuya Bharadwaj) తెలిపారు. ట్విటర్‌ వేదికగా తనను ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్‌ చేస్తున్న వారిపై ఆమె ఇటీవల హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ట్విటర్‌ యూజర్‌ ఒకరు అనసూయను ప్రశ్నించారు. కేరళ పండగ ‘ఓనం’ శుభాకాంక్షలు తెలియజేస్తూ అనసూయ ట్వీట్‌ పెట్టగా.. ‘‘నీలా మాకు పనీపాటా లేదని అనుకుంటున్నావా’ అని చెప్పి పోలీసులు పంపించేశారట’ అని సదరు వ్యక్తి కామెంట్‌ చేశారు. దానిపై స్పందించిన అనసూయ.. ‘లేదండీ.. మీలా పనీపాటా లేని వాళ్లకి బుద్ధి చెప్పే టైమ్‌ వచ్చిందని చెప్పారండి. మీకు నోరు జారటంలో తొందర ఎలా ఉందో బోల్తా పడటానికీ తొందర కదా. కాస్త ఓపిక పట్టండి. అన్నీ జరుగుతాయ్‌.. జరుగుతున్నాయ్‌’ అని దీటుగా సమాధానమిచ్చారు.

‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ, రావటం మాత్రం పక్కా!!’ అని ఆగస్టు 25న అనసూయ చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తమ హీరోని ఉద్దేశించి ఆమె అలా రాశారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనసూయను విమర్శిస్తూ వరుస కామెంట్లు, మీమ్స్‌ పెట్టారు. ఈ క్రమంలో ‘ఆంటీ’ అంటూ కొందరు కావాలనే అవమానిస్తున్నారని, అలా అన్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అనసూయ హెచ్చరించారు. చెప్పినట్టుగానే ఆగస్టు 29న పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని