Anirudh: 81 మిలియన్ల ‘హుకూం’.. మా ప్లానింగ్‌లో అస్సలు లేదు: అనిరుధ్‌

సంగీత దర్శకుడు అనిరుధ్‌ (Anirudh) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘జైలర్‌’ (Jailer) ఆల్బమ్‌ గురించి మాట్లాడారు.

Updated : 30 Sep 2023 14:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘జైలర్‌’ (Jailer), ‘జవాన్‌’ (Jawan)తో సంగీత దర్శకుడిగా ఈ ఏడాది వరుస విజయాలు అందుకున్నారు అనిరుధ్‌ (Anirudh). ఇటీవల విడుదలైన ‘జవాన్‌’ సక్సెస్‌తో ఆయన పేరు ఉత్తరాదికీ పాకింది. ఈ నేపథ్యంలోనే అనిరుధ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రూ.500 కోట్ల బడ్జెట్‌ లేదా రూ.కోటి బడ్జెట్‌.. సినిమా ఏదైనా సరే తాను మాత్రం ఒకేవిధంగా కష్టపడతానని అన్నారు. మరింత విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తుంటానని తెలిపారు.

అనంతరం ఆయన ‘హుకూం’ గురించి మాట్లాడుతూ.. ‘‘జైలర్‌’ కథ ప్రకారం మేము కేవలం ఒక్క పాటకే ప్లాన్‌ చేశాం. ఈ మేరకు ‘బంధమేలే’ కంపోజ్‌ చేశాం. సినిమా రఫ్‌ వెర్షన్‌ చూసిన తర్వాత వేరే పాటలకూ స్కోప్‌ ఉందని అర్థమైంది. జైలర్‌ సీక్వెన్స్‌లో రజనీకాంత్‌ చెప్పే ‘హుకూం’ డైలాగ్‌ నాకెంతో నచ్చేసింది. దాన్ని ఒక పాటలా క్రియేట్‌ చేయాలనిపించింది. అలా ‘హుకూం’ సిద్ధం చేశాం. అది బాగా వర్కౌట్‌ అయ్యింది. క్లైమాక్స్‌లోనూ ఆ పాటను ఉపయోగించాం. విశేష ఆదరణ లభించింది’’ అని అనిరుధ్‌ చెప్పారు. సంగీతం విషయంలో నెల్సన్‌ తనని బాగా నమ్మేస్తుంటారని.. ఎలాంటి సూచనలు చేయరన్నారు.

Nayanthara: సినిమా ప్రమోషన్‌కు అందుకే నయన్‌ దూరం: విఘ్నేశ్‌ శివన్‌

రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ (Nelson Dileepkumar) తెరకెక్కించిన చిత్రం ‘జైలర్‌’. పురాతన విగ్రహాల స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఇది సిద్ధమైంది. అనిరుధ్‌ స్వరాలు అందించారు. ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, ముఖ్యంగా ‘టైగర్‌ కా హుకూం’ పాటలకు విశేష ఆదరణ లభించింది. ఆడియో విడుదల కార్యక్రమంలో అనిరుధ్‌ లైవ్‌లో ఈ పాటను ఆలపించగా.. ఆ వీడియో యూట్యూబ్‌లో 23 మిలియన్ల వ్యూస్‌ అందుకుంది. ‘హుకూం’ ఆడియో పాటకు దాదాపు 81 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని